Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రూ.41 వేల కోట్ల ఖర్చుకు లెక్కలు లేవన్న పయ్యావుల… ఏపీ ఆర్థికశాఖ వివరణ!

రూ.41 వేల కోట్ల ఖర్చుకు లెక్కలు లేవన్న పయ్యావుల… ఏపీ ఆర్థికశాఖ వివరణ
వేల కోట్ల వ్యయానికి లెక్కాపత్రాలు లేవన్న పయ్యావుల
గవర్నర్ కు ఫిర్యాదు
ప్రభుత్వ లెక్కలు పద్ధతి ప్రకారం జరుగుతాయన్న అధికారులు
పీడీ ఖాతాల్లో సర్దుబాట్లు జరిగాయని వెల్లడి

రాష్ట్ర ఆర్థికశాఖలో రూ.41 వేల కోట్ల ఖర్చులకు లెక్కలు లేవని పీఏసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రూ.41,043 కోట్ల వ్యయానికి సంబంధించి ఎలాంటి రసీదులు లేవని, వాటిని వివిధ పద్దుల్లోకి మార్చేశారని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై నేడు ఏపీ ఆర్థికశాఖ అధికారులు స్పందించారు.

పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కలన్నీ పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కాగ్ పరిశీలనలను తమ దృష్టికి తీసుకురావడం ఆనవాయితీ అని తెలిపారు. సర్దుబాట్లు ఎక్కువగా పీడీ ఖాతాల్లోనే జరిగాయని, పన్ను మినహాయింపు బిల్లులకు జీఎస్టీ సర్దుబాట్లు ఉన్నాయని వివరించారు. ఏడాది చివర్లో పీడీ ఖాతాల నుంచి ఖర్చు కాని నిధులు మురిగిపోతాయని వెల్లడించారు

ఏపీ ఆర్థికశాఖలో రూ. 41 వేల కోట్ల దుర్వినియోగంపై విచారణ జరగాలి: సీపీఐ రామకృష్ణ

సరైన లెక్కలు లేవని గవర్నర్ కు పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు చేశారు
నిధుల దుర్వినియోగానికి జగన్ బాధ్యత వహించాలి

ఏపీ ఆర్థికశాఖలో పెద్ద ఎత్తున రూ. 41 వేల కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్థికశాఖ జమా ఖర్చుల నిర్వహణలో లోపాలున్నాయని ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు.

రూ. 41 వేల కోట్ల నిధులకు సరైన లెక్కలు లేవని గవర్నర్ కు నిన్న పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు చేయడం గమనార్హమని ఆయన అన్నారు. ఈ నిధుల దుర్వినియోగానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై కాగ్ తో ప్రత్యేకంగా ఆడిట్ చేయించాలని అన్నారు.
.

Related posts

కరోనా ఎఫెక్ట్: వర్చువల్‌గానే టీడీపీ మహానాడు!

Drukpadam

ఏపీ లో మొత్తం 24 మంది మంత్రుల రాజీనామా …తిరిగి వచ్చేది ఎవరు ?

Drukpadam

2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు నడుం బిగించిన పవార్‌!

Drukpadam

Leave a Comment