Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు కేసీఆర్ తీపి కబురు … 50 వేల ఉద్యోగాల నియామకాలు!

నిరుద్యోగులకు కేసీఆర్ తీపి కబురు … 50 వేల ఉద్యోగాల నియామకాలు
-తక్షణమే 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం
-జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం
-జోనల్ అడ్డంకులు తొలగిపోయాయన్న సర్కారు
-ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలన్న కేసీఆర్

తెలంగాణలో నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తెరలేపింది. జోనల్ అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖల్లో ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటిని రెండో దశలో భర్తీ చేయాలని సీఎం సూచించారు.

స్థానికులకు న్యాయం జరగాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం జోనల్ విధానాన్ని తీసుకువచ్చింది. అత్యంత శాస్త్రీయ విధానం అనుసరించి ఈ జోనల్ విధానానికి రూపకల్పన చేసినట్టు టీఆర్ఎస్ సర్కారు చెబుతోంది.

ఈ నెల 13న తెలంగాణ క్యాబినెట్ సమావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 13న తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ వేదికగా క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న ఏపీతో జలవివాదాలు, కరోనా పరిస్థితులు, ఆంక్షల సడలింపులు, థర్డ్ వేవ్ అంచనాలు వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఏపీతో అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

సినిమా థియేటర్ల పునఃప్రారంభం, ఇతర సామాజిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే విషయాన్ని కూడా చర్చించనున్నారు. కరోనా థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ల వ్యాప్తి తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

అంతేగాకుండా, వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో, వ్యవసాయ సంబంధం అంశాలపైనా చర్చ జరగనుంది. విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందించడం, కల్తీ రహిత ఎరువులు, విత్తనాలు రైతులకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు కర్తవ్య బోధ చేయనున్నారు. వీటితో పాటే పల్లె ప్రగతి, పట్టణాభివృద్ధి అంశాలకు కూడా క్యాబినెట్ భేటీ అజెండాలో చోటు ఉన్నట్టు తెలుస్తోంది.

 

Related posts

పురిటి నొప్పులతో విలవిల్లాడిన గర్భిణి.. టెర్రస్‌పై విందు చేసుకున్న వైద్యులు!

Drukpadam

ధరల పెరుగుదల వార్తల నేపథ్యంలో.. భారీగా పెరిగిన ఈవీ-టూ వీలర్ల అమ్మకాలు…

Drukpadam

ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన తెలంగాణ…

Drukpadam

Leave a Comment