Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ ఆలా వైకాపా ఇలా …..లేటరైట్ బాక్సెట్ తవ్వకాలు పై పరస్పర విమర్శలు!

టీడీపీ ఆలా వైకాపా ఇలా …..
లేటరైట్ బాక్సెట్ తవ్వకాలు పై పరస్పర విమర్శలు

టీడీపీ ఆలా….

జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారు: నారా లోకేశ్ ఆరోపణ
విశాఖ మన్యం ఏరియాలో లేటరైట్ తవ్వకాలు
పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు
అడ్డుకున్న పోలీసులు
పోలీసులు తమ నేతలను నిర్బంధించారన్న లోకేశ్

విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించారంటూ ఆ పార్టీ అగ్రనేత నారా లోకేశ్ వెల్లడించారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు.

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యంలో జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇది 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అని అన్నారు. బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడని విమర్శించారు. తన బంధువులైన వైవీ విక్రాంత్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేంతవరకు పోరాడాలని టీడీపీ నేతలకు సూచించానని లోకేశ్ వివరించారు. అభయారణ్యాన్ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న వైసీపీ మైనింగ్ మాఫియాను తరిమికొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

వైకాపా ఇలా …..


లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందం
టీడీపీ తీరు దొంగే దొంగ దొంగ అన్నట్టుంది: బాక్సైట్ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందన

లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలంటూ ఆరోపణ
స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్
బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని స్పష్టీకరణ

విశాఖ మన్యంలో సీఎం జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ టీడీపీ నేతలు రౌతులపూడి వెళ్లి లేటరైట్ తవ్వకాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

టీడీపీ తీరు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. గత టీడీపీ పాలన సమయంలోనే అక్రమ మైనింగ్ తో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ సర్కారు వచ్చాక మైనింగ్ దోపిడీకి అడ్డుకట్ట పడిందని అమర్నాథ్ స్పష్టం చేశారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు బాబు ఎలా ఎదిగారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో తవ్వకాలకు సంబంధించి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అమర్నాథ్ వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని అన్నారు.

Related posts

తుమ్మలే పెద్ద ద్రోహి …కందాల అనుచరులు ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

సాగర్ లో కేసీఆర్ ,కేటీఆర్ ల ప్రచారం…

Drukpadam

ప్రజల దృష్టిని మళ్లించేందుకే… ట్రస్టుల ఎఫ్ సీఆర్ఏ లైసెన్సు రద్దుపై కాంగ్రెస్!

Drukpadam

Leave a Comment