Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రగతి భవన్.. కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా?: రేవంత్ రెడ్డి!

ప్రగతి భవన్.. కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా?: రేవంత్ రెడ్డి!
కాంట్రాక్ట్‌ నర్సులను అన్యాయంగా తొలగించారు
వారిని కరోనా సమయంలో దేవుళ్లని పొగిడారు
స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
ప్రగతి భవన్.. ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా కాదా?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ కేసీఆర్ సొంత ఆస్తి కాదని అది ప్రజలకు సంబందించినా అష్టి అని అన్యాయం జరిగినోళ్ళు తమకు న్యాయం చేయాలనీ వెళ్లి అడిగే హక్కు ఉందని అన్నారు. తమకు న్యాయం చేయాలనీ అడిగేందుకు వెళ్లిన కాంట్రాక్టు నర్సులపై లాఠీచార్జి చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రగతి భవన్ ని కల్వకుంట్ల ఫామిలీ ప్రవైట్ ప్రాపర్టీ లాగా కాకుండా పబ్లిక్ ప్రాపెర్టీ లాగా చూడాలని డిమాండ్ చేశారు. నర్సులకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు.

కరోనా స‌మ‌యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను ఇప్పుడు ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి తొలగించిందంటూ కాంట్రాక్ట్‌ నర్సులు నిన్న‌ హైదరాబాదులో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసుల దాష్టీకానికి పాల్ప‌డ్డారంటూ వ‌చ్చిన ఓ వార్త‌ను టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

ప్ర‌భుత్వ తీరు వ‌ల్ల త‌మ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అందులో న‌ర్సులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విషయంపై నర్సులు ఇప్ప‌టికే హెచ్‌ఆర్సీనీ ఆశ్రయించారు. తాజాగా, రేవంత్ రెడ్డిని కూడా క‌లిసి త‌మ త‌ర‌ఫున పోరాడాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దీనిపై స్పందిస్తూ ప్ర‌భుత్వంపై రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

‘కరోనా సమయంలో దేవుళ్లని పొగిడిన స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రగతి భవన్.. ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా లేక, కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా కేసీఆర్? 1600 మంది స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Related posts

రాహుల్ అనర్హతపై దిగ్విజయ్ వర్సెస్ కపిల్ సిబల్…

Drukpadam

శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి జిహాద్‌పై పాఠాలు చెప్పాడంటూ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Drukpadam

జమిలి ఎన్నికలు చట్ట సవరణ లేకుండా సాధ్యమా ?

Drukpadam

Leave a Comment