కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి…..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి నేను పోటీ అన్న కౌశిక్ రెడ్డి
టికెట్ ఖరారు అయిందని కార్యకర్తతో ఫోనులో మాట్లాడిన కౌశిక్
యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని వ్యాఖ్య
కలకలం రేపిన కౌశిక్ రెడ్డి ఆడియో
టీఆర్ఎస్ టికెట్ తనకేనన్న కౌశిక్
షోకాజ్ నోటీసులు పంపిన కాంగ్రెస్
ఇలాంటి చర్యలను సమర్థించబోమన్న రేవంత్ రెడ్డి
ఇప్పటికే నోటీసులు ఇచ్చామని వ్యాఖ్య
యువతకు రూ. 4 – 5 వేలు ఇస్తానని వ్యాఖ్య
కౌశిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ
కొన్ని రోజుల క్రితం కేటీఆర్‌నూ కలిసి కౌశిక్
ఎప్పటినుంచో వస్తున్నా అనుమానాలు నిజమైయ్యాయి …… గత ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు….. ఆయన ఈటల ను టీఆర్ యస్ నుంచి బయటకు పంపిన వెంటనే ఈటలపై టీఆర్ యస్ కన్నా ఎక్కువగా విమర్శలు గుప్పించారు. ఈటల అవినీతి పరుడంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు…. పనిలో పనిగా టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను కలిశారు…. ఆయన్ను కలవడంలో పెద్ద విశేషం ఏమిలేదని మంత్రిగా మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పుకొచ్చారు…. తాను తిరిగి పోటీచేస్తున్నానని పెద్ద పెద్ద ర్యాలీ లు నిర్వహించారు… నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సాఫీగానే జరిగాయి… ఇది అంత కాంగ్రెస్ కోసమే అనుకున్నారు…. కాని అప్పటికే ఆయన కు హామీ వచ్చి నందునే ఆయన సొంత ఎజెండా ప్రకారం నడుచుకున్నారని ఇప్పుడు అర్థం అయింది.
కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా ….
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ హైకమాండ్ కు పంపించారు. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ టికెట్ తనకే రానుందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర జేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవసరమయితే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తనపై చర్యలు తీసుకోక ముందే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
లీకైన కౌశిక్ రెడ్డి ఆడీయో …..
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే రాబోతోందంటూ ఆయన మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఆయనకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.
మరోవైపు ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిందారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. అవసరమైతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు.
కౌశిక్ రెడ్డి పై టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ ఫైర్ ….
ఇంకోవైపు కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వస్తుందంటూ కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే పార్టీ మార్పుపై కౌశిక్ రెడ్డి ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఆయన మాట్లాడిన ఒక ఆడియో లీక్ అయింది. ఇప్పుడు ఈ ఆడియో కలకలం రేపుతోంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ ఆ ఆడియోలో కౌశిక్ రెడ్డి చెప్పారు.
ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీపీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ, గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు. ఆయనపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫోన్ సంభాషణపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని… లేని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కలకం రేపుతున్న కౌశిక్ రెడ్డి వ్యవహారం ….
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఆ నియోజక వర్గంలో పోటీ చేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది.
ఓ కార్యకర్తతో ఫోన్‌లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి పోటీచేయడానికి ఆ టికెట్ తనకే ఖరారైనట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని అన్నారు. ఒక్కొక్కరికీ 2 లేక 3 వేల రూపాయల చొప్పున ఇస్తానని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని ఆ కార్యకర్తకు కౌశిక్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇటీవలే మంత్రి కేటీఆర్‌ను కూడా కౌశిక్‌రెడ్డి కలిశారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండడం కలకలం రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. గతంలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈటల చేతిలో కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని టీఆర్‌ఎస్ తనవైపునకు తిప్పుకుంటుందంటూ ప్రచారం జరుగుతోంది.