Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

సుమన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం…

సుమన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం
-150 పైగా చిత్రాలలో నటించిన సుమన్
-అన్నయ్య లో వెంకటేశ్వర స్వామి , రామదాసులో శ్రీరాముడు పాత్రలు
-శివాజీ సినిమాలో ప్రతినాయకుడిగా …

నటుడు సుమన్‌ను లెజెండ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి విలన్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప్రస్తుతం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వస్తున్నారు.

Related posts

అక్కినేని.. తొక్కినేని’ అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై దుమారం ….

Drukpadam

పునీత్ చదివించిన ఆ 1800 మంది చిన్నారుల బాధ్యత నాదే: సినీ నటుడు విశాల్!

Drukpadam

చట్టం అందరికీ ఒకటే: వర్మతో భేటీ అనంతరం పేర్ని నాని వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment