Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అన్న జగన్ పై అలిగి పార్టీ పెట్టలేదు …తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసమే పార్టీ …వైయస్ షర్మిల

అన్న జగన్ పై అలిగి పార్టీ పెట్టలేదు …తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసమే పార్టీ …వైయస్ షర్మిల 
రాష్ట్రలో పాలనలేదు … కాంగ్రెస్ అమ్ముడుపోయింది .బీజేపీ కుమ్మక్కు అయింది -మేమె నిజమైన ప్రత్యాన్మాయం …వైయస్ షర్మిల
-అన్న జగన్ పై అలిగి పార్టీ పెట్టానని అనడం సరికాదు
రాసిపెట్టుకోండి తెలంగాణాలో నేను ప్ర‌భంజ‌నం సృష్టిస్తాం
తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో పాల్గొన‌క‌పోతే తెలంగాణపై ప్రేమ లేన‌ట్లేనా?
నిరుద్యోగుల కోసం నేను వ్ర‌త‌మే చేస్తున్నాను
ఎన్టీఆర్ గారికి టీడీపీ వెన్నుపోటు
వైఎస్సార్ గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది
అక్క‌డి నుంచే పాద‌యాత్ర షురూ..
కాంగ్రెస్‌ అమ్ముడుపోయిన పార్టీ
టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయి
తెలంగాణ‌లో మా పార్టీయే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అవుతుంది
ప‌గ‌లు, ప్రతీకారాల కోస‌మే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక
మ‌హిళ‌లంటే చుల‌క‌న ఎందుకు?

అన్న జగన్ పై అలిగి పార్టీ పెట్టానని కొందరు అంటున్నారు…. ఇది సరికాదు రాజన్న రాజ్యం కోసమే తెలంగాణాలో పార్టీ అని స్పష్టం చేశారు. షర్మిల వ్యాఖ్యలతో అన్న జగన్ తో ఆమెకు పడటంలేదు అనే మాటలను ఆమె కొట్టిపారేశారు ….అంతేకాకుండా వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల రాసిపెట్టుకోండి తెలంగాణ లో నేనే ప్రభంజనం సృష్టిస్తా ….తెలంగాణ లో టీఆర్ యస్ పట్ల నాయకుడు కేసీఆర్ పట్ల భ్రమలు తొలిగిపోయాయి…. రాష్ట్రంలో ఉన్న పార్టీలు ప్రత్యాన్మాయం చూపించడంలో విఫలమైయ్యాయి. కాంగ్రెస్ అమ్ముడు పోయింది. బీజేపీ ,టీఆర్ యస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. అందువల్ల ప్రజలు ఆ పార్టీల మాటలు నమ్మడంలేదని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కు టీడీపీ వెన్నుపోటు పొడిస్తే ,కాంగ్రెస్ వైయస్సార్ కు వెన్నుపోటుపొడిచాయని ఆమె ఘాటైన పదజాలంతో తన దాడిని రాష్ట్రంలోని అన్ని పార్టీలపై ఎక్కుపెట్టారు.

తాను త్వ‌ర‌లో చేవెళ్ల నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి చెప్పారు. తాను ప్ర‌భంజ‌నం సృష్టిస్తాన‌ని, ఈ విష‌యాన్ని రాసి పెట్టుకోవాల‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ అమ్ముడుపోయిన పార్టీ అని, టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయ‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో త‌మ పార్టీయే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు అర్థ‌మే లేదని చెప్పారు. ప‌గ‌లు, ప్రతీకారాల కోస‌మే హుజురాబాద్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నిక‌తో ప్ర‌జ‌లకు ఏమైనా మేలు జ‌రుగుతుందా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఈ ఎన్నికకు ఏమని అర్థం ఉందా? అని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ‌లో ప‌లు పార్టీల నేత‌లు పాద‌యాత్ర‌లకు సిద్ధ‌మ‌వుతుండ‌డం ప‌ట్ల మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె సమాధానం ఇస్తూ.. ‘హ‌రీశ్ రావు కూడా పాద‌యాత్ర‌ల గురించి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అస‌లు తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు పాద‌యాత్ర‌లు చేస్తాం? రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తే మేము ఎందుకు పాద‌యాత్ర‌లు చేస్తాం? క‌రోనాను ఆరోగ్యశ్రీ‌లో చేర్చితే మేము ఎందుకు పాద‌యాత్ర‌లు చేస్తాం?’ అని ష‌ర్మిల ప్ర‌శ్న‌లు కురిపించారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా విఫ‌ల‌మ‌య్యార‌ని, రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల బాధ‌ల‌ను అర్థం చేసుకోవ‌ట్లేద‌ని ఆమె విమ‌ర్శించారు.విఫలమైన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు ప్రత్యాన్మాయం వెతుకు తున్నారని షర్మిల అన్నారు .

మ‌హిళ‌లంటే టీఆర్ఎస్ అగ్ర‌నేత‌ల‌కు ఎందుకు చుల‌క‌న అని వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ రోజు హైద‌రాబాద‌డ్‌లో ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… మ‌హిళ‌లంటే వ్ర‌తాలే చేసుకుంటూ కూర్చోవాల‌ని కేటీఆర్ అంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిరుద్యోగుల కోసం తాను వ్ర‌త‌మే చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

రాజ‌న్న రాజ్యం రాక‌పోతే ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డ‌తారని ఆమె హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో పాల్గొన‌క‌పోతే తెలంగాణపై ప్రేమ లేన‌ట్లేనా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ‌కు వ్య‌తిరేక‌మ‌ని తాను ఎన్న‌డూ చెప్ప‌లేదని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంత అని, ఆయ‌న‌ను ఎవరూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని అనుకుంటారని చెప్పారు. కేసీఆర్ మ‌హిళ‌ల‌కు విలువ ఇవ్వ‌రని ఆమె ఆరోపించారు.

వైఎస్సార్ గారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది

కాంగ్రెస్ పార్టీపై ష‌ర్మిల మండిప‌డ్డారు. ‘ఎన్టీఆర్ గారిని టీడీపీ వెన్నుపోటు పొడిచిన‌ట్లే.. వైఎస్సార్ గారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. వైఎస్సార్ గారు చ‌నిపోయాక ఆయ‌న పేరును ఓ కేసులో ఎఫ్ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీ నేత‌లు తాము వైఎస్సార్ వార‌సులమ‌ని చెప్పుకుంటున్నారు. వీళ్లా వార‌సులు? సిగ్గుండాలి ఇలా చెప్పుకోవడానికి’ అని ష‌ర్మిల విమ‌ర్శించారు.

‘కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు. వైఎస్ తెలంగాణ వ్య‌తిరేకి కాదు. నేడు వైఎస్సార్ ఆశ‌యాల‌కు అనుగుణంగా అభివృద్ధి జ‌రిగే ప‌రిస్థితులు లేవు. రాజ‌న్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టాను. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను వైఎస్సార్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు’ అని ష‌ర్మిల చెప్పారు.

జ‌గ‌న్‌పై అలిగి పార్టీ పెట్టాన‌ని అన‌డం స‌రికాదు

తాను ఏపీ ముఖ్య‌మంత్రి, త‌న అన్న‌ జ‌గ‌న్‌పై అలిగి పార్టీ పెట్టాన‌ని అన‌డం స‌రికాదని ష‌ర్మిల అన్నారు. ‘ఒకవేళ నిజంగా అలిగితే మాట్లాడ‌డం మానేస్తారు కానీ, ఇలా పార్టీలు పెడ‌తారా? ఇక్క‌డ పార్టీ పెట్ట‌డానికి కార‌ణం ప్ర‌జ‌ల బాగు కోస‌మే. ఏడేళ్లుగా కేసీఆర్ పాల‌న‌లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. కోట్లాది రూపాయ‌లు అప్పులు తెచ్చారు. ఆ డ‌బ్బుల‌న్నీ ఏమి చేశారు? ఉద్యోగాలు ఇచ్చారా? రైతుల‌కు సాయం చేశారా?’ అని ష‌ర్మిల విమ‌ర్శించారు.

‘కేసీఆర్ బాత్రూంలు కూడా బుల్లెట్ ఫ్రూఫ్ తో క‌ట్టుకున్నారు. ఆయ‌న ప్రాణాల‌కు ఉన్న విలువ యువ‌త ప్రాణాల‌కు లేదా? నాకేదో ఏపీలో ప‌ద‌వి రాలేద‌నో, నేను అసంతృప్తిలో ఉన్నాన‌నో ఇక్క‌డ పార్టీ పెట్ట‌లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల బాగు కోసమే, రాజ‌న్న రాజ్యాన్ని తీసుకురావ‌డం కోస‌మే పార్టీ పెట్టాను’ అని ష‌ర్మిల చెప్పారు.

Related posts

తిరుపతి రాళ్లదాడిపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు…

Drukpadam

రాజ్య‌స‌భ‌కు ‘బాహుబ‌లి’ క‌థా ర‌చ‌యిత‌ విజయేంద్రప్రసాద్!

Drukpadam

ఇంద్రవెల్లి సభతో కేసీఆర్‌కు పోడు భూముల సమస్య గుర్తొచ్చింది: సీతక్క…

Drukpadam

Leave a Comment