Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్ ఇంటి వెనకాల శివశ్రీ ఇల్లు భద్రతా కారణాల రీత్యా కూల్చివేత!

ఏపీ సీఎం జగన్ ఇంటి వెనకాల శివశ్రీ ఇల్లు భద్రతా కారణాల రీత్యా కూల్చివేత
-నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమన్న చేయని శివశ్రీ
-రాత్రికి రాత్రి కూల్చివేసిన అధికారులు
-ఆత్మహత్యకు యత్నించిన శివశ్రీ సోదరుడు!
-భద్రతా కారణాల రీత్యా జగన్ నివాసం వెనకున్న ఇళ్ల కూల్చివేత
-ఇంటిని కూల్చివేయడంతో స్పృహ కోల్పోయిన శివశ్రీ తల్లి
-తనకు ప్రాణహాని ఉందంటూ వీడియో విడుదల
-ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆవేదన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వెనక పేదల ఇళ్ల కూల్చివేతలపై పోరాడుతున్న శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటిని కూల్చివేస్తున్నామని, గురువారం లోగా ఖాళీ చేసి వెళ్లాలని మంగళవారం నోటీసులు అంటించిన అధికారులు గతరాత్రి కూల్చివేయడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవడం వల్లే తన ఇంటిని కూల్చివేశారని, అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని శివశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ శివశ్రీ వీడియో విడుదల చేశారు. ఇది రాజకీయం చేయడం తగదని వైసీపీ నేతలు అంటున్నారు. అమర రెడ్డి నగర్ లో ఉన్న అనేకమందికి పునరావాసం చూపించిన తరువాతనే ఇళ్లను ఖాళీ చేయాలనీ చెప్పడం జరిగిందని ఇప్పటికే అనేక మంది స్వచ్చందంగా ఖాళీ చేసి వారికీ చూపించిన పూనావాసం లోకి వెళ్లారని అంటున్నారు.

భద్రతా కారణాల రీత్యా ముఖ్యమంత్రి నివాసం వెనక ఉన్న అమరారెడ్డినగర్ కాలనీలోని 321 కుటుంబాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. ఇందులో భాగంగా 277 కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేసింది. వీరిలో 124 మంది స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేయడంతో అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే, స్థలాల కేటాయింపులో న్యాయం జరగలేదని, నిరాశ్రయులకు మరింత పరిహారం ఇవ్వాలంటూ శివశ్రీ పోరాడుతున్నారు. కాగా, శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేయడంతో ఆమె తల్లి స్పృహతప్పి పడిపోయారు. మనస్తాపానికి గురైన ఆమె సోదరుడు ఆత్మహత్యకు యత్నించాడు.

Related posts

పొంగులేటి పోటీపై డైలమా …?అసెంబ్లీకా …పార్లమెంట్ కా.…?

Ram Narayana

బీజేపీ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడిని ఖండించిన అమిత్ షా!

Drukpadam

సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!

Drukpadam

Leave a Comment