Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరుకు సీఎం జగన్ నేతృత్వం వహించాలి: చంద్రబాబు!

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరుకు సీఎం జగన్ నేతృత్వం వహించాలి: చంద్రబాబు!
-విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి చంద్రబాబు లేఖ
-ఉద్యమాన్ని జగన్ ముందుండి నడిపించాలని సూచన
-ఐక్యపోరాటం అవసరమని ఉద్ఘాటన
-టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమని వెల్లడి

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలకు లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సీఎం జగన్ నేతృత్వం వహించాలని పేర్కొన్నారు. సీఎం జగన్ ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని సూచించారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలమని స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్ సాధించారని, ఎన్నో అవాంతరాలను అధగమించి 1992లో ప్లాంట్ ను దేశానికి అంకితం చేశారని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో రూ.4 వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడిందని, తాను అభ్యర్థించడం, ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని వివరించారు.

ఢిల్లీ లో కార్మికసంఘాల నేతలు …విశాఖ ఉక్కును ప్రవేటీకరించవద్దు

-వివిధ రాజకీయపార్టీల నేతలను కలిసిన నేతలు
-విశాఖ ఉక్కు ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందన్న ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ ఉక్కు ఉద్యమం ఢిల్లీని తాకింది . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేట్ పరం చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అన్ని రాజకీయపార్టీలు భగ్గుమంటున్నాయి. లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని కేంద్రం తెగ నమ్మే అందుకు తెగ ఆరాటపడటాన్ని తప్పు పడుతున్నారు. ఇది అంత్యంత జుగుస్సాకరమైన విషయంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.

విశాఖ ఉక్కు ప్రవేటీ కరణ ఆపాలని కోరుతూ కార్మిక సంఘనేతలు ఢిల్లీ లో పలువురు మంత్రులను , రాజకీయనాయకులను కలిసి వేడుకుంటున్నారు. అందులో భాగంగా నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తో కలిసి వెళ్లి కలిశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. వైసీపీ ఎంపీల వెంట ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల నేతలు కూడా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయాన్ని నిలిపివేయాలని ఎంపీలు, కార్మిక నేతలు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు.

అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. నవరత్న హోదా సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఏపీకి ఆభరణం వంటిదని పేర్కొన్నారు.

Related posts

రాజకీయాలలో ఓపిక అవసరం…. మాజీమంత్రి తుమ్మల!

Drukpadam

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. గిడుగు…

Drukpadam

కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?

Drukpadam

Leave a Comment