Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్యతో ఎర్ర గంగిరెడ్డి ,సునీల్ కుమార్ ,దస్తగిరిల ప్రమేయం పై అనుమానాలు!

వివేకా హత్యతో ఎర్ర గంగిరెడ్డి ,సునీల్ కుమార్ ,దస్తగిరిల ప్రమేయం పై అనుమానాలు
-వివేకా హత్యకేసులో కీలకంగా మరీనా వాచ్ మెన్ రంగయ్య వాంగ్మూలం
-ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్, దస్తగిరి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపణ
-మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య వాంగ్మూలం నమోదు
-సఫారీ 8 కోట్లు 9 మంది అని చెప్పినట్లు వస్తున్న వార్తలు
-తాను ఏమి చెప్పెనో తెలియదని అంటున్న రంగయ్య
-వివేకా హత్య కేసులో వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు
-2019లో వైఎస్ వివేకా హత్య ,ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న మర్డర్ కేసు

ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రంగయ్యను దాదాపు రెండున్నర గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు అనంతరం జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

వివేకానందరెడ్డిది సుపారి హత్య అని రంగయ్య చెప్పినట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణ అనంతరం రంగయ్య మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. తన పేరు వెల్లడిస్తే చంపేస్తానని వివేకానందరెడ్డి అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనను హెచ్చరించినట్టు చెప్పారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్, దస్తగిరికి వివేకానందరెడ్డి హత్యతో సంబంధం ఉందని మేజిస్ట్రేట్‌కు చెప్పినట్టు రంగయ్య తెలిపారు. తనకు ఈ ముగ్గురి నుంచి కూడా ప్రాణహాని ఉందన్నారు. ఈ హత్య కేసులో మొత్తం 9 మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారని మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం.

 

ఇవాళ జమ్మలమడుగు న్యాయస్థానంలో జడ్జి ఎదుట వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. రంగన్న ఈ కేసుకు సంబంధించి ఎంతో కీలక సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.

కాగా, గత నెలన్నర రోజులుగా కడప జిల్లాలోనే మకాం వేసిన సీబీఐ అధికారులు ప్రతిరోజూ కొందరు అనుమానితులను ప్రశ్నిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరుగురిపైనే సీబీఐ దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. వారిలో వివేకా ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పీఏ కృష్ణారెడ్డి, వాచ్ మన్ రంగన్న, పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబం, ఇనాయతుల్లాలను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. గతంలోనూ ఎర్రం గంగిరెడ్డి, సునీల్ కుమార్ ,దస్తగిరి లను విచారించారు. దస్తగిరిని న్యూ ఢిల్లీకి పిలిపించి మరి విచారించిన సిబిఐ అధికారులు అప్పట్లోనే వారికీ కొన్ని అనుమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నట్లు వాచ్ మెన్ రంగన్న తెలిపారు . ఎవరు పెద్దవారు కీలక వ్య్తకులు అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

 

ఎర్ర గంగిరెడ్డి నేనెవరో తెలియదంటే ఏమనుకోవాలి?: వాచ్ మెన్ రంగన్న

  • ఎర్ర గంగిరెడ్డి నాతో ఎన్నోసార్లు మాట్లాడారు
  • వివేకా హత్యకు ముందు ఇంట్లోకి ఎవరో వచ్చారు
  • వారెవరో నాకు తెలియదు
Erra Gangireddy spoke to me many times says Rangaiah

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు నోరువిప్పని వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న (రంగయ్య)… ఇప్పుడు సంచలన విషయాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తన పేరును వెల్లడిస్తే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్ది తనను బెదరించారని రంగయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో రంగయ్యతో తనకు పరిచయమే లేదని గంగిరెడ్డి చెప్పారు.

మరోవైపు ఈరోజు ఓ టీవీ ఛానల్ తో రంగన్న మాట్లాడుతూ, ఎర్ర గంగిరెడ్డి వివేకాతో ఉంటారని… తనతో ఎన్నోసార్లు మాట్లాడారని… ఇప్పుడు తానెవరో తెలియదని చెపితే ఏమనుకోవాలని ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని, వారెవరో తనకు తెలియదని అన్నారు. తనకు ఏమీ కాదని సీబీఐ అధికారులు చెపితేనే ఈ విషయాలను వెల్లడించానని చెప్పారు. జమ్మలమడుగు కోర్టులో జడ్జి ముందు నిన్న వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు.
 
అంతకు ముందు గంగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వివేకా తనకు దేవుడితో సమానమని చెప్పారు. చీమకు కూడా తాను అపకారం తలపెట్టనని అన్నారు. వివేకాతో సన్నిహితంగా ఉండటం వల్లే తనపై కేసు పెట్టారని తెలిపారు.

Related posts

ఎన్నికల అఫిడవిట్ లో అవాస్తవాలు.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ!

Drukpadam

ట్యూషన్ మాస్టర్ పాడుబుద్ది …స్పెషల్ క్లాస్ పేరుతొ బాలికపై అత్యాచారం !

Drukpadam

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి..!

Ram Narayana

Leave a Comment