Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్​ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్​ లో దిద్దుబాటు!..

పంజాబ్​ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్​ లో దిద్దుబాటు!..
చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్
ఈ నెల 28న మంత్రివర్గ విస్తరణ
పార్టీ నేతలతో కె.సి. వేణుగోపాల్, అజయ్ మాకెన్ సమావేశం
కేబినెట్ విస్తరణ ఆలస్యంపై పైలట్ ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ లో దిద్దుబాటు చర్యలు సీరియస్ గానే ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని పటిష్ట పరిచే చర్యలకు పార్టీ హైకమాండ్ నడుంబిగించింది. అందులో భాగంగానే ఇటీవల కొన్ని రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులు నియామకం లో సైతం చాల సీరియస్ గానే వ్యవహరించింది. తెలంగాణా ,పంజాబ్ లలో పీసీసీ అధ్యక్షుల నియామకంలో అనేక వత్తిళ్లు ,పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరింపులు , అలకపాన్పులు , అన్నిటిని లెక్క చేయకుండా తమ స్వంత నివేదికలు ,పార్టీల ఇంచార్జిల కసరత్తు లతో వ్యవహరించన తీరు గతంకు భిన్నంగా కనిపించింది . మహారాష్ట్రలో సైతం ఇదే తరహా గా పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసింది. పాతతరం నేతల మాటలను పక్కన బెట్టింది.మరికొన్ని రాష్ట్రాలలోకూడా నాయకత్వ మార్పుపై ద్రుష్టి సారించింది. పంజాబ్ లో ముఖ్యమంత్రి అడ్డుపడి నప్పటికీ పీసీసీ అధ్యక్షుడి నియామకంలో తాను చేయదల్చుకున్నది చేసింది. పీసీసీ అధ్యక్షుడుగా సిద్దకు ఇస్తే తాను బాధ్యతల స్వీకరించే కార్యక్రమానికి రానని భీష్మించుకు కూర్చున్న ముఖ్యమంత్రి అమరిందర్ రాకతప్పలేదు. ఇప్పుడు రాజస్థాన్ పార్టీ వ్యవహరణాలు చక్కదిద్దే పనిలో పార్టీ హైకమాండ్ ఏఐసీసీ దూతలకు భాద్యతలు అప్పగించింది.

పార్టీ లో జరుగుతున్న పరిణామాలపట్ల జి -23 సభ్యులు ఆశక్తిగా చూస్తున్నారు. తాము అనుకున్న విధంగా పార్టీలో మార్పుపై కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు మౌనంగా ఉన్నారు. ఏఐసీసీ ప్రక్షాళన జరగాలనే అభిప్రాయటంతో ఉన్నారు. ఏఐసీసీ కి పూర్తీ స్థాయి అధ్యక్షుడిని నియామకం జరగాలి అంటున్నారు.

అందులో భాగంగానే పార్టీలోని అసంతృప్తులను చల్లార్చే పనిలో పడింది కాంగ్రెస్. వివాదాలకు చెక్ పెట్టి సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పంజాబ్ లో సీఎం అమరీందర్ సింగ్, నవ్ జోత్ సింగ్ సిద్ధూల మధ్య నెలకొన్న ఘర్షణలకు తెరదించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ పగ్గాలను సిద్ధూకు అప్పగించి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది. తాజాగా, రాజస్థాన్ పై ఆ పార్టీ దృష్టి సారించింది.

సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్ ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అజయ్ మాకెన్ లు.. పీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

జులై 28న ఎమ్మెల్యేలంతా జైపూర్ లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం అశోక్ గెహ్లాట్ తోనూ వారిద్దరు సమావేశమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే శనివారం ఆయనతో వారిద్దరు భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో గెహ్లాట్, పైలట్ వర్గాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

Related posts

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !

Drukpadam

యూపీ ఎన్నికల్లో మాయావతి రాష్ట్రపతి అంటూ ప్రచారం చేసిన బీజేపీ !

Drukpadam

కాంగ్రెస్ పార్టీకో నమస్కారం … ప్రశాంత్ కిషోర్ సంచలనం ….

Drukpadam

Leave a Comment