ఢిల్లీలో మమత బిజీబిజీ.. నేడు మోదీతో భేటీ!
-సాయంత్రం నాలుగు గంటలకు భేటీ
-కాంగ్రెస్ సీనియర్ నేతలతోనూ సమావేశం
-రేపు రాష్ట్రపతి, సోనియాతో భేటీ
మూడవసారి పశ్చిమ బెంగాల్ పీఠం అధిరోవించిన మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన దేశ రాజకీయాలను ఆకర్షిస్తుంది. బెంగాల్ లో బీజేపీ ,టీఎంసీ హోరా హోరీగా తలపడిన తరువాత తుఫాన్ సందర్భంగా మోడీ బెంగాల్ పర్యటనకు వెళ్ళినప్పుడు పీఎం ను కొద్దిసేపు కలిసిన మమతా ఢిల్లీ లో మొదటి సరిగా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకునే మరికలుస్తున్నారు. ఇది పూర్తిగా అధికారిక సమావేశం . ఇటీవలనే ఆమె టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా ఎంపిక అయ్యారు. బెంగాల్ లో చట్టసభలో సభ్యురాలు కాకపోయినప్పటికీ ఆమె ఆర్నెల్ల లోపు చట్టసభకు ఎన్నిక కావచ్చుననే నిబంధనమేరకు ఆమె సీఎం గా కొనసాగుతున్నారు. ఆమెకోసం ఒక ఎమ్మెల్యే ఖాళీ చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీనిలో రాజకీయాకారణాలు ఉన్నాయని టీఎంసీ అభిప్రాయపడుతోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ మమతా ఎన్నికకాకుండా కరోనా సాకుచూపి ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా తమ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావిస్తుందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో ఆమె ప్రధానిని కలవనుండడం ఇదే తొలిసారి. సాయంత్రం నాలుగు గంటలకు మోదీతో దీదీ సమావేశమవుతారు. అలాగే, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతోనూ ఆమె సమావేశం అవుతారు. వీరిలో కమల్‌నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను సింఘ్వి వంటి వారు ఉన్నారు.
రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీలను కలుస్తారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలని మమత భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ పర్యటన అని చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో విపక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. దీంతో అందరినీ ఒకేసారి కలుసుకునే వీలుంటుందనే మమత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు, రేపు ఆమె బిజీబిజీగా గడపనున్నారు.