Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్… ఇండియా-శ్రీలంక రెండో టీ20 వాయిదా…

కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్… ఇండియా-శ్రీలంక రెండో టీ20 వాయిదా
-శ్రీలంక పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్యా
-ఐసొలేషన్ లోకి వెళ్లిపోయిన ఇరు జట్ల ఆటగాళ్లు
-ఈరోజు జరగాల్సిన టీ20 వాయిదా

శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడ్డాడు. దీంతో ఇండియా-శ్రీలంకల మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వాయిదా పడింది. ఇతర ఆటగాళ్లందరికీ కోవిడ్ టస్టులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ అని తేలితే ఈనాటి మ్యాచ్ ను రేపు నిర్వహించే అవకాశం ఉంది.

పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఇరు జట్లు వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లాలని ఆదేశాలు అందాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లందరి కరోనా రిపోర్టులు వచ్చేంత వరకు వారు ఐసొలేషన్ లోనే ఉండనున్నారు.

మరోవైపు కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో… పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ల ఇంగ్లండ్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లండ్ తో సిరీస్ కోసం లండన్ లో ఉన్న భారత ఆటగాళ్లలో ముగ్గురు గాయాల బారిన పడటంతో… వీరిద్దరినీ ఇంగ్లండ్ కు పంపుతున్నట్టు బీసీసీఐ నిన్న ప్రకటించింది. ప్రస్తుతం వీరు శ్రీలంకలోనే ఉన్నారు. ఇప్పుడు వీరికి కరోనా నెగెటివ్ అని తేలితేనే ఇంగ్లండ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

Related posts

ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ఘనంగా ముగించిన భారత్

Ram Narayana

అజాజ్ పటేల్ ఒక్క‌డే 10 వికెట్లు ప‌డ‌గొట్టిన వైనం… పుట్టినగడ్డపైనే పులకింత!

Drukpadam

నిజం ఏంటో బయటకు రావాలి.. కెప్టెన్సీ మార్పుపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment