Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో డబ్బు పంపిణి పై హై కోర్టులో కవితకు ఊరట … ఆరునెలల జైలు శిక్ష పై స్టే!

ఎన్నికల్లో డబ్బు పంపిణి పై హై కోర్టులో కవితకు ఊరట … ఆరునెలల జైలు శిక్ష పై స్టే
ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టు ను ఆశ్రయించిన కవిత
ఓటర్లకు డబ్బులు పంచారంటూ కవితపై ఫిర్యాదు
2019లో బూర్గంపహాడ్ పీఎస్ లో కేసు నమోదు
ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన ప్రజాప్రతినిధుల కోర్టు
హైకోర్టును లో స్టే రావడంపై కవిత మద్దతు దార్లలో ఆనందం

ఎన్నికల్లో డబ్బు పంపిణి ఒక జబ్బుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలే ఒక ఖరీదైన వ్యాపారంగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కవితే కాకుండా అనేక మందిపై డబ్బు పంపిణీ ఆరోపణలు ఉన్నాయి. దానిపై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. విచారణలో డబ్బు పంపిణి జరిగిన విషయం నిర్దారణ కావడంతో మహబూబాబాద్ ఎంపీ గా ఉన్నకవిత కు 10 వేల రూపాయల జరిమానా , ఆరునెలలు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే .

గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును ఎంపీ మాలోత్ కవిత హైకోర్టులో సవాల్ చేశారు. కవిత పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే మంజూరు చేసింది.

కోర్టు తీర్పు అమలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో ఎంపీ కవితకు ఊరట కలిగినట్టయింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం వేళ ఓటర్లకు డబ్బులు పంచారంటూ మాలోత్ కవితపై బూర్గంపహాడ్ పీఎస్ లో కేసు నమోదవడం తెలిసిందే.

Related posts

అహ్మ‌దాబాద్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌ను త‌ల‌ద‌న్నేలా రైల్వే స్టేష‌న్‌…

Drukpadam

ఢిల్లీలో మోదీని క‌లిసిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్.. కీల‌క వ్యాఖ్య‌లు!

Drukpadam

కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రo

Drukpadam

Leave a Comment