Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

థర్డ్ వేవ్ భయాలు… అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్!

థర్డ్ వేవ్ భయాలు… అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
-మళ్లీ క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
-కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని వార్తలు
-ఆగస్ట్ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం

క్రమంగా ప్రపంచవ్యాపితంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విమాన సర్వీసుల నిషేధాన్ని భారత్ ప్రభుత్వం పొడిగించింది. ఈ పొడగింపు ఆగస్ట్ 31 అర్థ రాత్రి వరకు ఉంటుందని వెల్లడించింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఇప్పుడు అనేక దేశాలలో కేసులు పెరుగుతున్నాయి. కొన్ని దేశాలలో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైంది. అమెరికాలో సైతం రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి …అనేక దేశాలు విమాన రాకపోకలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది . అనేక దేశాలు థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి.

ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలను… ధర్డ్ వేవ్ భయాలు వణికిస్తున్నాయి. పలు దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమయిందనే వార్తలు వస్తున్నాయి. మన దేశంలో సైతం క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారింది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి ఉత్వర్వులు జారీ అయ్యాయి.

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం 2021 ఆగస్ట్ 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో డీజీసీఏ పేర్కొంది. ఈ నిషేధం కార్గో (రవాణా) విమానాలకు వర్తించదని తెలిపింది. అయితే కొన్ని సెలెక్ట్ చేసిన రూట్లలో అవసరాలను బట్టి కేస్ టు కేస్ బేసిస్ కింద అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలను అనుమతిస్తామని వెల్లడించింది.

కేంద్రం కూడా థర్డ్ వేవ్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఏపీ తో పాటు కేరళ ,మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ ఢిల్లీ , తమిళనాడు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు థర్డ్ వేవ్ పై ద్రుష్టి సారించాయి.

Related posts

ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది.. మూడో డోసు వేసుకోండి: ఆంటోనీ ఫౌచీ

Drukpadam

ఇప్పుడే పాఠశాలలు తెరిస్తే వైరస్ విజృంభణకు అవకాశం ఇచ్చినట్టే: వీకే పాల్…

Drukpadam

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల గరిష్ఠ ధరను నిర్ణయించిన కేంద్రం…

Drukpadam

Leave a Comment