జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావులు తాటికల్లు సరదా తీర్చుకున్నారు.జిల్లాలోని రామవరం గ్రామంలో గీతకార్మికులు ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ కు వెళ్ళుతున్న మంత్రులు కల్లు అమ్ముతున్న మండవలను చూసి ముచ్చటపడ్డారు.వెంటనే వారు ప్రయాణస్తున్న వాహనాలను ఆపి మండవల దగ్గరకు వెళ్లి మంచిచెడులు మాట్లాడారు.గౌడన్నల కోరిక మేరకు సురాపానంగా భావించే కల్లును సేవించి ఆనందవ్యక్తంచేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గీతకార్మీకులకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వారితో పంచుకున్నారు. మంత్రులే స్వయంగా వచ్చి తమవద్ద ఆగి కల్లు సేవించండ పై గీతాకార్మికులు సైతం ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.మంత్రులతో కలిసి ఫోటోలు సెల్ఫీలు దిగి సంతోషపడ్డారు.అనంతరం మంత్రులు రామవరం వెళ్ళి మొఘలుల పీడను వ్యతిరేకంగా నిలిచి వారిని గడగడలాడించిన మొదటి పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
previous post
next post