Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీకి ఝలక్ రాజకీయాలకు ఇక సెలవు…సంచలన నిర్ణయం తీసుకున్న బాబుల్ సుప్రియో!

బీజేపీకి ఝలక్ రాజకీయాలకు ఇక సెలవు…సంచలన నిర్ణయం తీసుకున్న బాబుల్ సుప్రియో!
-కేంద్రంపై కినకే కారణం అంటున్న రాజకీయపరిశీలకులు
-ఇటీవల మోదీ క్యాబినెట్ విస్తరణ
-కేంద్ర సహాయమంత్రి పదవిని కోల్పోయిన సుప్రియో
-రాజకీయాలకు గుడ్ బై అంటూ ఫేస్ బుక్ పోస్టు
-ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడి

బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో సంచలన ప్రకటన చేశారు. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు బాబుల్ సుప్రియో ఇటీవలి వరకు కేంద్ర సహాయమంత్రిగా కొనసాగారు. కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఆయన పదవి పోయింది. ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. తాను ఏపార్టీ లోను చేరబోవడం లేదని కూడా ప్రకటించారు. కేంద్రం లో సహాయమంత్రిగా ఉన్న ఆయన మోడీ తన మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్నట్లు ప్రచారం చేసింది.మోడీ ,షా లాంటి హేమ హేమీలు బెంగాల్ ప్రచారంలో పాల్గొన్నారు. అయినా మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజలు తిరిగిపట్టం కట్టారు. దీంతో అంతకుముందు బీజేపీ లో చేరిన అనేక మంది నేతలు తిరిగి టీఎంసీ లో చేరుతున్నారు.

ఆయన అసన్ సోల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. కాగా, బాబుల్ సుప్రియో తన తాజా నిర్ణయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం… మరే ఇతర పార్టీ కూడా తనను ఆహ్వానించలేదని, తాను కూడా ఏ పార్టీలోనూ చేరట్లేదని తెలిపారు. ఎక్కడైనా గానీ, ఒకరు సామాజిక సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని సుప్రియో అభిప్రాయపడ్డారు.

బాబుల్ సుప్రియో రాజకీయాల్లోకి రాకముందు బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడిగా గుర్తింపు పొందారు. సంగీత కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన సుప్రియో, బాల్యం నుంచే ప్రతిభ చూపారు. బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో పాటలు పాడారు. పలు ఆల్బంలు రూపొందించడమే కాకుండా, దేశవిదేశాల్లో అనేక స్టేజ్ షోల్లో పాల్గొన్నారు.

Related posts

బ్రోకర్లు, కబ్జాకోర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతారు: ఈటల రాజేందర్!

Drukpadam

పవర్ గేమ్ ….ప్రధాని పర్యటనకు దూరంగా కేసీఆర్…

Drukpadam

వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ…!

Drukpadam

Leave a Comment