Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పీవీ సింధుకు భారత్ లో బ్రహ్మరథం …

పీవీ సింధుకు భారత్ లో బ్రహ్మరథం …
ఢిల్లీ ,హైద్రాబాదులలో కేంద్ర ,రాష్ట్రమంత్రులు అభినందనలు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు కాంస్యం
ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరిక
సింధుకు స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు
ఈసారి సింధు స్వర్ణం గెలవాలని ఆకాంక్ష
పీవీ సింధు కొత్త కోచ్‌పై కేంద్ర మంత్రి రిజిజు ప్ర‌శంస‌ల జ‌ల్లు
సింధు కోచ్ పార్క్ ఇప్పుడు భారత్‌లో హీరో అయ్యారు

టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో వరసగా రెండవ ఒలంపిక్స్ పథకం సాధించిన పీవీ సింధుకు భారత్ లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరస రెండవసారి పథకం సాధించిన సింధుకు అటు కేంద్రం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. సింధు పేరు ప్రపంచంలో మరోమోగింది. భారత్ లో పథకం సాదించిన సింధును రాజకీయాలకు అతీతంగా అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు పీవీ సింధుకు, కోచ్ పార్క్ టే సంగ్ కు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సింధు సెమీస్ లో ఓటమిపాలైనా, ఆమె పోరాడిన తీరు ఆకట్టుకుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సింధు గొప్ప పేరు తీసుకువచ్చిందని తెలిపారు. హైదరాబాదులోనే బ్యాడ్మింటన్ ఓనమాలు దిద్దుకున్న సింధు ఇప్పుడు రెండడుగులు వెనక్కి వేసినా, వచ్చే ఒలింపిక్స్ లో రెండడుగులు ముందుకు వేస్తుందని అభిలషించారు.

సీఎం కేసీఆర్ కూడా సింధును ఎంతో ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. సింధు వచ్చే ఒలింపిక్స్ లో తప్పకుండా స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. తద్వారా మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రత్యేక క్రీడా విధానం తీసుకువస్తున్నామని, భవిష్యత్తులో తెలంగాణ ఓ క్రీడా హబ్ గా మారనుందని అన్నారు.

ఇక పీవీ సింధు మాట్లాడుతూ, తనకు తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఎంతో సహకారం అందించిందని వెల్లడించింది. తాను ఎక్కడ ప్రాక్టీసు చేసుకుంటానన్నా వెంటనే అనుమతులు మంజూరు చేశారని తెలిపింది. మీడియా మద్దతు కూడా మరువలేనిదని పేర్కొంది.

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి స్వదేశానికి చేరుకున్న నేప‌థ్యంలో ఢిల్లీలో త‌న కోచ్ పార్క్ తే సంగ్ తో క‌లిసి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును క‌లిసింది. ఈ సంద‌ర్భంగా కోచ్ పార్క్‌పై కిర‌ణ్ రిజిజు ప్రశంసలు కురిపించారు. పార్క్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాన‌ని, ఆయ‌న ఇప్పుడు భారత్‌లో హీరో అయ్యారని రిజిజు అన్నారు. ప్రతి భారతీయుడికి పార్క్‌ గురించి తెలిసింద‌ని ఆయ‌న చెప్పారు.

పీవీ సింధు త‌న కోచ్‌తో క‌లిసి త‌న‌ను క‌లిసింద‌ని చెబుతూ రిజిజు ట్వీట్ చేశారు. పీవీ సింధుకు అండ‌గా నిలుస్తోన్న‌ తల్లిదండ్రులు, బ్యాడ్మింటన్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల‌కు కూడా రిజిజు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేడు ప్రధాని మోదీని పీవీ సింధు కలిసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం ఆమె హైదరాబాదుకు రానుంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, అభిమానులు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

Related posts

ఆర్ఆర్ఆర్ విజయం వెనుక మూడు తరాల కృషి: విజయేంద్ర ప్రసాద్!

Drukpadam

ఖమ్మం టీఆర్ యస్ లో గ్రూప్ రాజకీయాలు…సద్దు మణుగుతాయా ? పెద్దవవుతాయా??

Drukpadam

ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ఆరోపణలపై స్పందించిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…

Drukpadam

Leave a Comment