Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో ఇక 45 నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం.. ప్రారంభించిన కేటీఆర్!

హైదరాబాద్‌లో ఇక 45 నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం.. ప్రారంభించిన కేటీఆర్
-నగరంలోని మూడువేల రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్ వై-ఫై సౌకర్యం
-యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు
-వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో కేటీఆర్ వీడియో కాల్

హైదరాబాద్‌లో పనిమీద బయటకు వెళ్లినవారు వై-ఫై లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపై 45 నిమిషాలపాటు ఉచితంగా వై-ఫైని ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మూడు వేల రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో యాక్ట్ ఫైబర్ నెట్ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా, మంత్రి కేటీఆర్ నిన్న సాయంత్రం లాంఛనంగా దీనిని ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు. తానన్న ఒకే ఒక్క మాటతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ వై-ఫై అని పేర్కొన్నారు. బాల మల్లాది మాట్లాడుతూ.. నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ వై-ఫైని నెలకు 3 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నట్టు చెప్పారు.

Related posts

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలు వీరే!

Ram Narayana

బెంగాల్ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత!

Drukpadam

జగన్ చూసుకుందాం రా!: పవన్ కల్యాణ్ సవాల్…

Drukpadam

Leave a Comment