Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

లక్ష్యం పోలీసులు ….పేలిన సామాన్యుల వాహనం ఛత్తీస్ ఘడ్ లో ఘటన

లక్ష్యం పోలీసులు ….పేలిన సామాన్యుల వాహనం ఛత్తీస్ ఘడ్ లో ఘటన
-పోలీసుల లక్ష్యంగా మందుపాతర.. పేలిన సామాన్యుల వాహనం.. పలువురికి గాయాలు!
-ఛత్తీస్ గఢ్ లోని ఘోతియాలో పొరపడ్డ మావోలు
-12 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
-వివరాలు వెల్లడించిన దంతేవాడ ఎస్పీ

మందు పాతరాలతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ ఘడ్ అడవులలో పోలిసుల లక్ష్యం గా అమర్చిన మందుపాతరలు గురితప్పింది . పోలీసులు వాహనం అనుకోని సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు పేల్చారు. ఫలితికంగా వాహనం బాగా దెబ్బ్బతిన్నది. అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిని వారిలో ఇద్దరి పరిస్థితి విషంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘట స్థలానికి హుటాహుటిన పోలీస్ బలగాలతోపాటు , ఆంబులెన్స్ లు వచ్చాయి. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో కుం బింగ్ చేపట్టారు.

పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు పెట్టిన మందుపాతరకు.. సామాన్య ప్రజలు వెళ్తున్న వాహనం బలైంది. ఈ రోజు ఉదయం ఛత్తీస్ గఢ్ లోని ఘోతియాలో జరిగిన ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మాలేవాదీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోతియా గ్రామంలో ఉదయం 7.35 గంటలకు నారాయణపూర్ నుంచి దంతేవాడకు కొత్తగా వేస్తున్న రోడ్డుపై మావోయిస్టులు మందుపాతర పేల్చారని దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. దాడికి గురైన వాహనం నారాయణపూర్ నుంచి వస్తోందని, దంతేవాడకు వెళ్తోందని ఎస్పీ చెప్పారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వాస్తవానికి ఆ దాడి పోలీసులను లక్ష్యంగా చేసుకున్నదని, కానీ, అదే సమయంలో అటువైపు వచ్చిన సామాన్యుల వాహనం దాడికి గురైందని చెప్పారు.

Related posts

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట-రేవంత్ రెడ్డి పై చార్జిషీటు!

Drukpadam

హథ్రాస్ పాపం ఎవరిదీ …తొక్కిసలాటలో రక్తపాతం 122 మంది మృతి …

Ram Narayana

కోడలి రహస్య భాగాల్లో ఇనుప రాడ్డుతో కాల్చి.. కారంపొడి చల్లిన భర్త, అత్తమామలు!

Ram Narayana

Leave a Comment