అమరీందర్ ప్రధాన సలహాదారు పదవికి ప్రశాంత్ కిశోర్ రాజీనామా!
-రాజీనామా లేఖ పంపిన పీకే
-కొంతకాలం వ్యక్తిగత జీవితంపై దృష్టి
-తన భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ఇప్పుడు దేశవ్యాపితంగా ఆయన కదలికలపై రాజకీనాయకీకుల ద్రుష్టి . ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఎన్నికకు వ్యూహకర్తగా తాను పనిచేయడంలేదని ప్రకటించారు. కొంత కలం ఖాళీగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని ప్రతిపక్షాలు అన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను ఎన్నికల్లో పనిచేస్తానని ప్రకటించారు. తరువాత ఆయన రాజకీయ కురువృద్ధుడు మరాఠా యోధుడు ఎన్సీపీ నేత శరద్ పవర్ ను రెండు మూడు సార్లు కలిసి దేశ రాజకీయాలపై చర్చించారు. తరువాత ఆయన సోనియా, రాహుల్ గాంధీని కలిశారు.దీంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ లో చేరి ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించబోతున్నారని ప్రచారం జరిగింది. ఆయన కొన్ని నెలల క్రితం 2022 మార్చ్ లో జరగనున్న ఎన్నికలలో పంజాబ్ సీఎం అమరిందర్ ఎన్నికల సలహాదారుగా వ్యవహరించేందుకు ఒప్పందం కుదిరింది. కాని ఆయన తాను కొంత కలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నందున ఎన్నికల సలహాదారుగా వ్యవహరించలేనని తన రాజీనామా పత్రాన్ని కెప్టెన్ అమరిందర్ సింగ్ కు లేఖ రాశారు. …..
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కి కొన్ని నెలలుగా ప్రధాన సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ పదవికి రాజీనామా చేశారు. కొంత కాలంపాటు వ్యక్తిగత జీవితంతపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాను ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర పోషించకుండా తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని, ప్రధాన సలహాదారు పదవిలో కొనసాగలేనని చెబుతూ అమరీందర్ సింగ్‌కు ఆయన రాజీనామా లేఖ పంపారు.
తన భవిష్యత్తు కార్యాచరణపై కూడా తాను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తనను ప్రధాన సలహాదారు పదవి నుంచి రిలీవ్ చేయాలని ఆయన కోరారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిశోర్‌ను తన ప్రధాన సలహాదారుగా అమరీందర్ సింగ్ నియమించుకున్నారు.
అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మమతా బెనర్జీ తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఆ రాష్ట్రంలో టీఎంసీ గెలిచింది. అనంతరం వ్యూహకర్తగా ప్రత్యక్షంగా పనిచేయబోనని, తన బృందం మాత్రం పనిచేస్తుందని చెప్పారు. ఇటీవల దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల అధినేతలతో చర్చించి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ సమయంలో అమరీందర్ ప్రధాన సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేయడం గమనార్హం.