ఖేల్ రత్నలో రాజీవ్ కు గ్రహణం …తొలగించిన కేంద్రం స్వయంగా వెల్లడించిన ప్రధాని!
‘రాజీవ్ గాంధీ’ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చేసిన కేంద్రం
-ఇక నుంచి ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’
-ప్రజల విజ్ఞప్తుల మేరకు మార్చామన్న మోదీ
-గొప్ప నిర్ణయమంటున్న నెటిజన్లు
రాజీవ్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ క్రీడాకారులకు ఇచ్చే అత్యంత విశిష్ట పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న లో రాజీవ్ పేరు లేకుండా కేంద్రం ఖేల్ రత్న ఉంచి రాజీవ్ పేరు తొలగించి ధ్యాన్ చంద్ పేరును చేర్చారు . ఈ విషయాన్నీ ప్రధాని స్వయంగా వెల్లడించారు. ప్రజల విజ్ఞప్తిల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అయితే ఇది కేవలం గాంధీ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత తోనే కేంద్రం ఈ లాంటి నిర్ణయం తీసుకున్నదని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. బీజేపీ అనుకూల ప్రచార సాధనాలు మాత్రం ఇది గొప్ప నిర్యమని అంటున్నారు.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేయడం దీన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించటం చకచకా జరిగిపోయాయి. . ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రధాని ప్రకటించారు. ‘రాజీవ్’ను తీసేసి హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును చేర్చారు.
ఇక నుంచి క్రీడల్లో అత్యున్నత అవార్డును ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టాల్సిందిగా తనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని మోదీ చెప్పారు. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యావాదాలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టామన్నారు. దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని ఆయన కొనియాడారు.
కాగా, రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రారంభించారు. అయితే, ఇన్నాళ్లకు ఆ అవార్డుకు ధ్యాన్ చంద్ పేరును పెట్టారు. మూడు వరుస ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ నేతృత్వంలోని హాకీ బృందం స్వర్ణ పతకాలను సాధించింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజైన ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు. కాగా, ఇది గొప్ప నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నట్లు వార్తాకథనాలు వచ్చాయి. ఇది రాజకీయ నిర్ణయమని గాంధీ కుటుంబంపై మొదటినుంచి బీజేపీ కి ప్రత్యేకించి మోడీ షా లకు వ్యతిరేకత ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంత మంది మండి పడుతున్నారు.