Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయింది: చంద్రబాబు…

వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయింది: చంద్రబాబు…
-పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
-నిధులు దారిమళ్లిస్తున్నారని ఆరోపణ
-జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
-రేషన్ కార్డుల కోతపై ఆగ్రహం

పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైఎస్ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయిందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, కుంభకోణాలు చేసే స్కీమ్ లకు ఆ నిధులు మళ్లిస్తున్నారని వెల్లడించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని విమర్శించారు.

నిబంధనల పేరుతో భారీగా రేషన్ కార్డులు, పింఛన్లలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు ఆర్ అండ్ బి విభాగానికి అప్పగించడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

పులిచింతల గేటు కొట్టుకు పోవడం దురదృష్ట కరం …..జనసేన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా పులిచింత‌ల డ్యామ్ 16వ నంబర్‌ గేటు విరిగిపోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని జ‌న‌సేన పార్టీ నేత నాందెడ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ఎంత సుర‌క్షితంగా ఉందో గేట్ల నాణ్య‌త‌, వాటి ప‌ని తీరు ఆధారంగా ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌స్తార‌ని ఆయ‌న అన్నారు. అలాంటిది జ‌ల ప్ర‌వాహం ధాటికి గేటు విరిగిపోవ‌డం, అందుకు సంబంధించి యాంక‌ర్ తెగిపోవ‌డం చూస్తుంటే ఆ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ అంశాల‌పై భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని చెబుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ ప్రాజెక్టు లోప‌భూయిష్టంగా ఉంద‌ని జ‌ల వ‌న‌రుల ఇంజ‌నీరింగ్ నిపుణులు మొద‌టి నుంచీ చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌న్నది వాస్త‌వ‌మ‌ని అన్నారు. పులిచింత‌ల ప్రాజెక్టు ఏ మేర‌కు ప‌దిలం? అన్న విష‌యాన్ని నిగ్గు తేల్చడంతో పాటు లోపాలు ఎలా చ‌క్క‌దిద్దాల‌న్న విష‌యాల‌పై అధ్య‌య‌నం చేయడానికి ఉన్న‌త‌స్థాయి నిపుణుల క‌మిటీని నియ‌మించాల‌ని డిమాండ్ చేశారు.

 

ఆందోళన అవసరం లేదు …మంత్రి పేర్ని నాని …..

పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పులిచింతల గేటుపై ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు రాష్ట్ర క్యాబినెట్ కు తెలియజేశారని పేర్కొన్నారు. పులిచింతలలో ఇంత నీరు ఎప్పుడూ నిల్వచేయలేదని వెల్లడించారు. యాంత్రిక తప్పిదం వల్ల గేటు విరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు వివరించారు. హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల నిండుతుందని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.

Related posts

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక అవినీతి ఆరోపణలు…చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని బీజేపీ హెచ్చరిక …

Ram Narayana

సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ…!

Drukpadam

అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు…చంద్రబాబు

Drukpadam

Leave a Comment