Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేశాన్ని అమ్ముతున్న నరేంద్ర మోడీ నుండి భారతదేశాన్ని రక్షించాలి: పోతినేని!

దేశాన్ని అమ్ముతున్న నరేంద్ర మోడీ నుండి భారతదేశాన్ని రక్షించాలి: పోతినేని
-సెప్టెంబర్ 9న జరిగే సేవ్ ఇండియా ఉద్యమాన్ని జయప్రదం చేయండి
-సిపిఎం త్రీటౌన్ పాదయాత్ర లో పాల్గొన్న పోతినేని

ఖమ్మం
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆగస్టు 9న సేవ్ ఇండియా పేరుతో జరిగే నిరసనకు మద్దతు గా సిపిఎం ఖమ్మం త్రీటౌన్ కమిటి ఆధ్వర్యంలో 14 కార్పోరేషన్ డివిజన్లలో 15కిలోమీటర్లు పాదయాత్ర కార్యక్రమాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు గ్రెయిన్ మార్కెట్ ముందు ఈ రోజు ప్రారంభించారు.
అనంతరం సిపిఎం త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య అధ్యక్షతన పాదయాత్ర ప్రారంభ సభలో పోతినేని మాట్లాడుతూ… నాటి బ్రిటిష్ పాలకులను తలదన్నే విధంగాఉపా, ఎన్ఎ తదితర నల్లచట్టాలతో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కేస్తుందని అందుకే మళ్ళీ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని
రగిలిస్తూ, ప్రతిఘటనా పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల అఖిల భారత కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుకు మద్దతు గా సిపిఎం ఈ రోజు పాదయాత్ర చేపట్టి సంఘీభావం తెలుపుతుందన్నారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన గత ఏడేండ్ల నుండి నయా ఉదారవాద విధానాలు దూకుడుగా, క్రూరంగా అమలు సాగుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రైవేటీకరిస్తున్నదని, కీలకరంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. బొగ్గు, రైల్వే,
విద్యుత్, విమానాశ్రయాలు, ఓడరేవులు, స్టీలు ప్లాంట్లు, ఆయిల్ కంపెనీలు మొదలుకొని విద్య, వైద్యం, చివరికి రక్షణ రంగాన్ని కూడా
కార్పొరేట్ అధిపతులకు అప్పజెప్పుతున్నదన్నారు. రెండోసారి 2019లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వానికి పట్టపగ్గాలు లేవు.
పార్లమెంట్ లో వున్న మంద బలాన్ని ఉపయోగించి అనేక నిరంకుశ చట్టాలను రూపొందిస్తున్నదని, అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని
సర్వనాశనం చేసి, ఆహార భద్రతను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి,
కార్మికులను బానిసత్వంలోకి నెట్టేందుకు తెచ్చినవే 4 లేబర్ కోడ్లు అని, గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను నిరోధించి, కనీసం 100రోజులైనా
ఉపాధికి గ్యారంటీనిచ్చే ఉపాధి హామీ చట్టంలో వేతనాల చెల్లింపులో కూలాల విభజనలు తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. చిన్న, మధ్య
తరగతి మరియు రైతాంగానికి ఎంతో కొంత ఉపశమనం ఇస్తున్న ప్రస్తుత విద్యుత్ చట్టానికి, సబ్సిడీని ఎగొట్టేందుకు విద్యుత్ సవరణ చట్టం తెస్తుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ, దేశ ఫెడరల్ విధానానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను కేంద్ర బిజెపి సర్కార్ కాలరాస్తున్నదని,
అందులో భాగంగా కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను తెచ్చి అమిత్ షాను దాని పీఠం మీద కుర్చోబెట్టిందన్నారు. ఈ దెబ్బతో సహకారరంగం కకావికలం కానున్నది.2020 మార్చి నెలనుండి దేశం కరోనా కోరల్లో చిక్కుకున్నది. ప్రపంచంలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా వున్న దేశంగా
అమెరికా సరసన భారత్ నిలబడింది. గతం సం||ము మొదటి వేవ్, 2021లో వచ్చిన సెకండ్ వేవ్ తో దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతులమైంది.
లాక్డౌన్లతో ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉండే వారి సంఖ్య 6 కోట్లనుండి 13.4 కోట్లకు పెరిగింది. ఆకలి, దారిద్ర్యం పెరిగిపోయింది. పౌష్టికాహారం లోపం ప్రత్యేకంగా పిల్లల్లో ఆందోళనకర స్థితికి నెట్టారు.
సుమారు 10 కోట్ల మంది వలస కార్మికుల కన్నీటి గాధలు వర్ణనాతీతం. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనూ ప్రజలను ఆదుకునేందుకు
మోదీ ప్రభుత్వానికి మనసొప్పలేదని. ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500/-లు ఇవ్వాలని ప్రజా
సంఘాలు, ఆర్థికవేత్తలు కోరినప్పటికీ పట్టించుకోలేదు. పైగా ఈ కాలంలోనే డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచిందని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9 న జరిగే నిరసనలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వర రావు, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, తుమ్మా విష్ణు వర్దన్, త్రీటౌన్ నాయకులు బండారు యాకయ్య, వజినేపల్లి శ్రీ నివాసరావు, కార్పోరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, యస్ కె బాబు, భూక్య శ్రీ నివాసరావు, మద్ది సత్యం, యస్ కె హిమామ్, పత్తిపాక నాగసులోచన, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలి… మాజీ ఎంపీ పొంగులేటి!

Drukpadam

దీదీని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

Drukpadam

చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు తహతహ …స్కేచ్  వర్క్ అవుట్ అవుతుందా ?

Drukpadam

Leave a Comment