మాట:-బడ్జెట్ పై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజం -బీజేపీ నేత జీవీ ఎల్
మర్మం :-ఎందుకొచ్చిన గొడవ ముందుగానే ఒప్పుకుంటున్నారు
మాట:- జగన్ ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అంటున్నది -చంద్రబాబు
మర్మం :- వాళ్ళు అనకపోతే మీరు అనాలనేగా సార్
మాట :- బడ్జెట్ బ్రమ్మాండం -పవన్ కళ్యాణ్
మర్మం :- తిరుపతిలో ఆవకాశం కోసమే మీ పొగడ్తలు అనుకుంటున్నారు
మాట :-సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేను కట్టడి చేయాలి -ఎంపీ ధర్మపురి అరవింద్
మర్మం :-ఎవరిని ఎవరు కట్టడి చేయాలో బీజేపీ బాగా తెలుసు అనుకుంట
మాట :- నా 40 ఏళ్ల సర్వీస్ లో ఎప్పుడు వివాద స్పదం కాలేదు -నిమ్మగడ్డ
మర్మం :- ఇప్పుడు ఎవరికోసమో అయ్యారని అనుకుంటున్నారు