Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు ఆగ్రహం ,అచ్చన్న హుంకారం

చంద్రబాబు ఆగ్రహం ,అచ్చన్న హుంకారం
-అచ్చన్న అరెస్ట్ , పట్టాభి పై దాడి
-తూర్పులో సర్పంచి అభ్యర్థి భర్త ఆత్మహత్య
-పంచాయతీ పోరులో ఆగని హింస -యస్ ఈ సి పరుగులు
-ఘర్షణలకు భాదులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక- యస్ ఈ సి
-సీఎం ను కలుస్తాం స్పందన లేకపోతె భవిషత్ కార్యాచరణ రూపొందిస్తాం -బాబు

ఏపీ పంచాయతీ ఎన్నికలు హింసత్మకంగా మారుతున్నాయి. దాడులు ,ప్రతి దాడులు, హత్యలు , బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. చంద్రబాబు తమ పార్టీ వ్యక్తులపై జరుగుతన్న దాడులపట్ల అగ్రం వ్యక్తం చేస్తుండగా , రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చంనాయుడు హుంకరిస్తున్నారు. తన స్వగ్రామమైన నిమ్మాడలో తమకు వ్యతిరేకంగా పోటీలో అభ్యర్థి ఉండటంపై బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్ట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ కు తరలించారు. దీంతో ఏపీ పంచాయతీ ఎన్నిలక వ్యవహారం వేడెక్కింది .
చంపుతారా …. చంపండి ….. ప్రశ్నిస్తే చంపుతారా? ఎంతమందిని చంపుతారో చూస్తాం అంటూ ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలపై వరస దాడులు జరుగుతున్నాయని దీనికి ప్రభుత్వమే భాద్యతవహించాలన్నారు. అంతకు ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చమనాయుడు అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. చాల చోట్లా తెలుగుదేశం నాయకులపై జరుగుతున్నా దాడులను ఆయన ప్రస్తావించారు.
తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి పై విజయవాడలోని ఆయన నివాసం వద్ద దాడి జరగటం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి పై దాడి జరిగిందని తెలిసిన వెంటనే చంద్రబాబు ఆయన నివాసానికి చేరుకున్నారు. పట్టాభితో మాట్లాడాడు , జరిగిన సంఘటనలు గురించి తెలుసుకున్నారు. అక్కడ మీడియా తో మాట్లాడిన చంద్రబాబు ఊగిపోయారు. జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే దాడులు కొనసాగితే తాము సహించబోమని హెచ్చరించారు. పట్టాభి ఇంటినుంచి బయటకు బయలుదేరి బయటకు వచ్చారు. ఆయన బయటకు వస్తున్నా విషయం ముందుగానే తెలుసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు ఆకస్మికంగా ఒక్క సారిగా ఆయనపై దాడి చేశారు. ఆయన తేరుకునే లోపలే ఆయన్ను కర్రలతో కట్టి అక్కడనుంచి పారిపోయారు. వచ్చినవారు మోటార్ సైకిల్ పై వచ్చి నట్లు సీసీ టీవీ ఫుటేజీ లో గుర్తించారు. ఇది ముందుగా వేసుకున్న పధకం ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు. పట్టాభిపై గతంలో కూడా దాడి జరిగింది. వరస సంఘటనలపై అందరం తెలుగుదేశం నేతలం వెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తాం. తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే సీఎం స్పందన చూసి భవిషత్ కార్యాచరణను రూపొందిస్తాం అని చంద్రబాబు అన్నారు. చట్టం అనేది కొందరికి చుట్టం కాదని పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. అచ్చంనాయుడు కూడా పోలీసులపై సీరియస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం . మీ అంతు చూస్తా ,నేనే హోమ్ మంత్రిని అని బెదిరింపులకు దిగటంపై విస్మయం వ్యక్తం అయింది . పరస్పరం విమర్శలు లాంటివి సహజమే అయినప్పటికీ అయి శృతిమించుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ పదవికి పోటీచేస్తున్న అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడటం కలకలం లేపింది. వైసీపీ వల్లనే ఆయన ఆత్మహత్య కు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హుటాహుటిన తూర్పుగోదావరి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన వాళ్ళకుటుంబాన్ని పరామర్శించారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక ఎన్నికల కమిషనర్ స్వయంగా వెళ్లి భాదిత కుటుంబాన్ని పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది .

 

Related posts

ఆ సమాచారంతోనే జయలలితకు దూరమయ్యా: శశికళ!

Drukpadam

మైలవరం వైసీపీ నేతలకు మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ …

Drukpadam

చంద్రబాబు కారును ఢీకొట్టిన మరో కారు.. తప్పిన ప్రమాదం!

Drukpadam

Leave a Comment