Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ కు రాహుల్ చికిత్స :పూర్వవైభవం దిశగా అడుగులు!

ఏపీ కాంగ్రెస్ కు రాహుల్ చికిత్స :పూర్వవైభవం దిశగా అడుగులు
పూర్వ వైభవం సాధ్యమేనా ? అనే సందేహాలు
-రాహుల్ ను కలిసిన పలువురు ఏపీ కీలక నేతలు
-జగన్ కు ప్రజల మద్దతుపై రాహుల్ ఆరా
– పార్టీకి దూరంగా ఉన్న నాయకులను యాక్టీవ్ చేసే ప్లాన్
-పీసీసీ అధ్యక్షుడి మార్పు పై కసరత్తు
– రాహుల్ కలిసిన కెవిపి ,కిరణ్ కుమార్ రెడ్డి , శైలజానాథ్ , చింత మోహన్ ,జెడి శీలం

చావచచ్చి సత్తువలేకుండా ఉన్న ఏపీ కాంగ్రెస్ కు రాహుల్ చికిత్స చేసేందుకు సిద్ధమైయ్యారు. అందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్న జబ్బుపై రాహుల్ రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చించారు. కాంగ్రెస్ కు పూర్వవైభవం రావాలంటే తీసుకోవలసిన చర్యలపై నాయకులతో విడివిడిగా చర్చించారు. అయితే పూర్వ వైభవం సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు వెళ్లిన నాయకులూ ఎవరు పెద్దగా జనాకర్షణ ఉన్న నాయకులూ కాదు. అయితే వీరునుంచి ఇన్ ఫుట్ తీసుకున్న రాహుల్ రాష్ట్ర రాజకీయాలు …కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ,కేవిపీలకు బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది.

తెలంగాణ తరహాలో ఏపీకి ఒక పీసీసీ చీఫ్ నియామకం జరగాలని కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ పలు కీలక అంశాల పైన ఆరా తీసారు. రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, చింతా మోహన్, జెడి శీలం, మాజీ ఎంపి కెవిపి రామచందర్‌రావు, హర్షకుమార్, పిసిసి చీఫ్ శైలజానాధ్‌తో వన్‌టు వన్ సమావేశమయ్యారు.

పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు. ఏపీలో జగన్ పాలన…ఏ ఏ వర్గాలు జగన్ కు మద్దతుగా ఉన్నాయనే అంశం పైన రాహుల్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ- క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి బలంగా ఉన్నాయంటూ నేతలు రాహుల్ కు వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరితో సమావేశం కావటంతో..ఆ నేతలు జగన్ పాలన పైన-ఎలా ఎదుర్కోవాలనే అంశం పైన తమ అభిప్రాయాలను రాహుల్ కు వివరించారు. వైసీపీ-బీజేపీ సంబంధాలను గురించి కూడా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం.

కేంద్రంలో బీజేపీకి వైసీపీ మద్దతునిస్తోందన్న అంశాన్ని జగన్ కు మద్దతిస్తున్న వారు గమనిచంటం లేదా..వారి వరకు విషయం వెళ్లటం లేదా అంటూ రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ -టీడీపీ ప్రస్తుత బలం ఎలా ఉందంటూ రాహుల్ వాకబు చేసారు. ప్రతిపక్షంగా టీడీపీ-బీజేపీలో ఎవరు బలంగా కనిపిస్తున్నారు… టీడీపీ పైన ప్రజల్లో స్పందన ఏంటంటూ రాహుల్ ఏపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరక పోరాటాలకు మద్దతు ఎలా ఉందంటూ తెలుసుకొనే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో రాహుల్ ఒక ఆసక్తికర అంశాన్ని ప్రశ్నించటంతో పాటుగా… కొన్ని సందేహాలను క్లియర్ చేసుకొనే ప్రయత్నం చేసారు.

జగన్ మతం గురించి రాహుల్ ఆరా..

జగన్ క్రిస్టియనా…ఆయన కు అంతగా వారి మద్దతు ఎలా లభిస్తోందంటూ రాహుల్ ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా ఉండే ఆ నేత ఒక రకంగా రాహుల్ ప్రశ్నతో అవాక్కయ్యారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరన్ దగ్గర నుంచి రాహుల్ కీలక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీ పరంగా సామాజిక వర్గాలను తిరిగి దగ్గర చేసుకోవటానికి ఏ రకంగా ముందుకు వెళ్లాలి… వెళ్లిపోయిన నేతలను ఎలా ఆకర్షించాలనే అంశం పైన ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయపరిస్థితులపై కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన అంశాలను విన్న తరువాత..పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఏపీ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకుడు కాంగ్రెస్ హయాంలో దళితులు, మైనారిటీల కోసం రూపొందించిన పథకాలను, గత ఏడేళ్ల నుంచి రెండు ప్రభుత్వాలు రద్దుచేశాయని వివరించారు. నియోజకవర్గాల వారీగా ఎస్సీ-ఎస్టీ వర్గాల వారితో సమావేశాలు నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఇక, వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కేవీపి నుంచి రాహుల్ ప్రస్తుత పరిస్థితుల పైన సమాచారం సేకరించారు. కేవీపి సైతం తన అభిప్రాయాలను వెల్లడించారు.

కిరణ్ – కేవీపీలకు కీలక బాధ్యతలు..

జగన్ ను రాజకీయంగా ఎదుర్కొని.. తిరిగి కాంగ్రెస్ బలోపేతం అవ్వటం కోసం పూర్తి నివేదిక-కార్యాచరణ సిద్దం చేసే బాధ్యతను కేవీపీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. దళితులను తిరిగి పార్టీ వైపు మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించి, ఇన్చార్జి ఉమెన్‌చాంద్‌తో చర్చించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. జగన్ ను ఎదర్కోవటం పైన ఎలాంటి ప్లాన్ అమలు చేయాలో చెప్పాలంటూ రాహుల్ ప్రధానంగా మాజీ సీఎం కిరణ్… కేవీపీల నుంచి సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు.

జగన్ కేసులు..సీఎంగా కిరణ్..

గతంలో రోశయ్య ను సీఎం పదవి నుంచి తప్పించి కిరణ్ ను హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. ఆ సమయంలోనే జగన్ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. అయితే, జగన్ పైన పెట్టిన కేసుల్లో..జరిగిన కార్యాచరణ మొత్తం కిరణ్ ఆధ్వర్యంలోనే జరిగినట్లుగా వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించే వారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ గురించి ఎటువంటి నిర్ణయం జరగలేదు. త్వరలోనే మరో సారి రాహుల్ ఈ నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

 

Related posts

ముద్రగడ, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీలకు ఊరట: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత…

Drukpadam

సబ్ కమిటీలు చురుకుగా పని చేయాలి …

Ram Narayana

What’s The Difference Between Vegan And Vegetarian?

Drukpadam

Leave a Comment