Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత!

తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత
-వివేకా హత్యకేసులో కొనసాగుతున్న దర్యాప్తు
-తమ ఇంటిచుట్టూ అనుమానిత వ్యక్తి తిరిగాడన్న సునీత
-కుటుంబ భద్రతపై ఆందోళన
-సీఐకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడి
-ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని విచారించిన సిబిఐ
-68వ రోజు కొనసాగిన సీబీఐ విచారణ
-అనుమానితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి
-ఆయనతో పాటు మరో వ్యక్తి హాజరు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతున్న తరుణంలో, ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎస్పీ లేకపోవడంతో లేఖను కార్యాలయ సిబ్బందికి అందించారు. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5.10 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, అదే సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత లేఖలో వెల్లడించారు.

అతడు వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తిలాగే ఉన్నాడని ఆమె వివరించారు. ఈ విషయమై ఆగస్టు 12న సీఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు.

వివేకా హత్య జరిగిన తర్వాత డాక్టర్ సునీతారెడ్డి 15 మంది అనుమానితుల పేర్లను అధికారులకు అందించారు. వారిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడి పై కొనసాగుతున్న విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా మరో కీలక వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించింది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో 68వ రోజు విచారణ కొనసాగింది.

అందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్ ఆఫీసులో పనిచేసే రఘునాథరెడ్డి అనే వ్యక్తి కూడా విచారణకు వచ్చారు.

Related posts

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ యంత్రం కూలి 14 మంది మృతి

Ram Narayana

ఏపీ లో సంచలనం …అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు పై కేసు ..

Drukpadam

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలి ఆత్మహత్యాయత్నం!

Drukpadam

Leave a Comment