ప్రజల అభ్యున్నతి కోసం జనాభా లెక్క అవసరం అయినప్పుడు , కులాల జనాభా గణన తప్పు ఎలా అవుతుంది : లాలూ ప్రసాద్ యాదవ్
-జంతువులనే లెక్కిస్తున్నప్పుడు.. కులాల వారీగా జనాభాను ఎందుకు లెక్కించకూడదు?
-కులాల వారీగా జనాభాను లెక్కించాల్సిన అవసరం ఉంది
-వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం జనాభా లెక్కలు ఎందుకు జరపడం లేదు
-కులాల వారీగా జనాభా లెక్కింపు తప్పెలా అవుతుంది?
ఎప్పటినుంచో కులాల వారీగా ప్రత్యేకించి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్స్ అమలు జరపాలని లాలూ ప్రసాద్ యాదవ్ , ములాయం సింగ్ యాదవ్ లాంటి వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు జనాభా లెక్కల విషయం తెరపైకి రావడంతో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కులాల జనాభా ప్రత్యేకించి బిసిల జనాభా లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. జంతు జనాభానే లెక్కిస్తున్నప్పుడు ,ప్రజల జనాభా ఎందుకు లెక్కించకూడదని ఆయన అన్నారు.ప్రజల అభ్యున్నతే జనాభా లెక్కింపు ప్రధాన లక్ష్యం అయినప్పుడు… దేశంలోని వేలాది కులాల లెక్కింపు ఎందుకు తప్పవుతుందని అన్నారు ఈ మేరకు లాలూ ట్విట్ చేశారు.
కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన, మరింత వెనుకబడిన కులాల వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కులాల వారీగా లెక్కలు అవసరమని చెప్పారు. జంతువులు, పక్షులు ఇతర జాతులను మనం లెక్కిస్తున్నామని… అలాంటప్పుడు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం జనాభా లెక్కలను ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు.
ప్రజల అభ్యున్నతే జనాభా లెక్కింపు ప్రధాన లక్ష్యం అయినప్పుడు… దేశంలోని వేలాది కులాల లెక్కింపు ఎందుకు తప్పవుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో కూడా కులాల వారీగా జనగణన చేపట్టాలనే అంశంపై చర్చ జరిగింది. కొందరు బీజేపీ ఎంపీలు కూడా ఈ జనగణన కోసం డిమాండ్ చేశారు.