నిమ్మగడ్డ పై చర్యలకు అధికారం ఉంది -కాకాని
-మహారాష్ట్రలో ఇదేతరహా జరిగింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకునే అధికారం శాసనసభ కు ఉందని శాశనసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇదే తరహా లో మహారాష్ట్రలో శాసనసభ్యులను కించపరిచారన్న ఆరోపణలపై ఆరాష్ట్ర ఎన్నికల కమిషనర్ అరెస్ట్ అయ్యారని ఆయన అన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యదు మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయనకు వచ్చిన ఫిర్యాదును ప్రివిలైజ్ కమిటీ కి అప్పగించారని ,కమిటీ కూర్చొని దీనిపై 173 నిబంధనకింద చర్చించిందని అన్నారు. కమిటీ ప్రాధమికంగా యస్ ఈ సి మీద వచ్చిన ఆరోపణలపై అసలు చర్చవచ్చా లేదా అని సందేహం ఉందని దానిపై గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పటి యస్ ఈ సి మధ్య నెలకొన్న తగాదా పై ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న చారాయను ఆయన గుర్తు చేశారు.బొంబాయి హైకోర్ట్ కూడా దాన్ని సమర్తించిందని తెలిపారు . నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగ బద్ద పదవిలో పొంది రాజకీయ నాయకుడులాగ వ్యవహరించటం పై విమర్శలు ఉన్నాయి. మంత్రులమీద గవర్నర్ కు సైతం బొత్స, పెద్దిరెడ్డి లపై ఫిర్యాదు చేశారు. వారిమీద చర్యలు తీసుకోవాలన్నారు. దీనితో వారు ఆయన చర్యలపై మండి పడుతున్నారు. ప్రస్తుతం జగన్ కాబినెట్ లో సీనియర్ మంత్రులుగా ఉన్నవారు యస్ ఈ సి చర్యలతో తమ గౌరవానికి భగంకలిగిందని , తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ లో వేడి వేడి చర్చ జరుగుతుంది. నిమ్మగడ్డ కూడా ఎక్కడ తగ్గటం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకోగా ,అది వైసీపీ వాళ్ళ దౌర్జన్యాల వల్లనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడకు వెళ్లిన నిమ్మగడ్డ ,దోషులను వదిలి పెట్టమని అన్నారు.
అనగాని అభ్యతరం
గతంలో ఎమ్మెల్సీ కి సభాహక్కుల నిబంధన వర్తించదన్నారుగా అని టీడీపీ కి చెందిన ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ అన్నారు. శివనాథ్ రెడ్డి అనే టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీ లో చేతితె సభాహక్కుల నోటీసు ఇస్తే వర్తిచాడన్నారుకదా ? అని ప్రశ్నించారు. సభాహక్కుల ఉల్లంఘన శాసన సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని మంత్రులకు కాదని ,మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు . మహారాష్ట్రలో అప్పటి విలాసరావు దేశముఖ్ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పై కక్షగట్టిందన్నారు. అయినా సుప్రీం కోర్ట్ దీన్ని తప్పు పట్టిన విషయాన్నీ గమనించాలన్నారు.