Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం రానున్న మాణిక్యం ఠాకూర్

ఖమ్మం రానున్న మాణిక్యం ఠాకూర్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు , పట్టభద్రుల ఎన్నికల కు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేసే కార్యక్రంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ శుక్రవారం సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క తో కలిసి ఖమ్మం రానున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా పార్టీ యంత్రాంగాన్ని తయారు చేస్తున్నది . ఈసారి ఖమ్మం కార్పొరేషన్ లో సత్తాచాటాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తున్నది . ఇప్పటికే మేయర్ అభ్యర్థి మీద ఒక అంచనాకు వచ్చిన కాంగ్రెస్ మిగతా డివిజన్లపై కసరత్తు చేస్తున్నది. అన్ని డివిజన్లలో దీటైన అభ్యర్థులను పోటీకి నిలపాలని ప్రయత్నం చేస్తుంది .గత ఎన్నికలలో 10 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్ ఈసారి మైజార్టీ డివిజన్లు గెలవటం ద్వారా కార్పొరేషన్ ను కైవశం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అయితే ఖమ్మం లో అసలు కాంగ్రెస్ ఉందా? లేదా ? అనే చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఈ ఎన్నికలలో అందరి అంచనాలకు మించి తాము ఫలితాలు సాదించబోతున్నట్లు నాయకులూ చెబుతున్నారు. గత ఎన్నికలతోనే 10 డివిజన్లలో గెలిస్తే 7 గురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే అధికార టీఆర్ యస్ లో చేరారు . కేవలం ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు. ఎమ్మెల్యే గా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లో చేరిన అనంతరం ఎమ్మెల్సీగా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ఖమ్మం కార్పొరేషన్ లో తన వాణిని వినిపించారు. ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తీ అయిన తరువాత ఆయన కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. గత ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచినా 7 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఐదుగురు అధికార టీఆర్ యస్ లో చేరారు . మిగిలింది కేవలం ఇద్దరు మాత్రమే .వారిలో ఒకరు సి ఎల్ పీ నేత భట్టి విక్రమార్క కాగా , మరొకరు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య . భద్రాచలం ఎమ్మెల్యేపై న కూడా టీఆర్ యస్ ఫోకస్ పెట్టింది. ఆయన కూడా టీఆర్ యస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన చేరలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి , మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీచేశారు. ఇద్దరు నియోజకవర్గంలో పెద్దగా పర్యటించటంలేదు. కాంగ్రెస్ కు ఇప్పటికి ప్రజలలో కొంత పలుకు బడి ఉంది. కానీ నాయకత్వం లోపం ఉంది. ఖమ్మం అసెంబ్లీ కి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు . పొత్తుల్లో భాగంగా ఖమ్మం ను టీడీపీ కు కేటాయించటంతో ఇక్కడ నుంచి నామ నాగేశ్వరరావు పోటీచేశారు.లోకసభ ఎన్నికల నాటికీ ఆయన టీడీపీ కి గుడ్ బై చెప్పి టీఆర్ యస్ లో చేరి ఖమ్మం లోకసభకు పోటీచేశారు. అసెంబ్లీ కి కాంగ్రెస్ పోటీచేయకపోవటం పెద్ద మైనస్ గా మారింది. ప్రస్తుతం పోట్ల మాధవిని కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గా భావిస్తున్నారు. ఆమె గతంలో సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేశారు. కొద్దీ ఓట్ల తేడాతో ఆమె కాంగ్రెస్ కు చెందిన దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. తరువాత రాజకీయంగా ఆమెకు ఆవకాశం లభించలేదు. ఆమె భర్త పోట్ల నాగేశ్వరరావు తెలుగుదేశంలో యువశక్తి చైర్మన్ గా , తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేసీగా పనిచేశారు. రాజకీయంగా బలమైన సామజిక వర్గం కు చెందినవారు కావటం ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించటం వారికీ అనుకూలంగా మారె అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీని భావిస్తున్నది . అందువల్ల రేపటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పర్యటనలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంభందించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఆవకాశం ఉంది . అందువల్ల జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులన్నీ ఈసమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తున్నది .

Related posts

టీడీపీ ఎన్నారై విభాగంలో కెనడా, దక్షిణాఫ్రికా కమిటీలకు నూతన కార్యవర్గాల నియామకం!

Drukpadam

సీఎం జగన్ టూర్ లో బాలినేనికి అవమానం…!

Drukpadam

కేసీఆర్ ఆహ్వానం మేరకే తెలంగాణకు వెళ్లాను: అఖిలేశ్ యాదవ్!

Drukpadam

Leave a Comment