Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

యువనేత కేటీఆర్, హరీష్ రావులతో పాటు ప్రజాధారణ ఉన్న మంత్రులను హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి పంపించేందుకు అధిష్టానం నిర్ణయం..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఉన్న క్రేజ్ మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే పువ్వాడ అజయ్ తీరు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీను విజయానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు నిర్ణయించుకునట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ సేవా దృక్పథంతో యువనేత కేటీఆర్ అడుగుజాడల్లో నడిచే మంత్రిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది.

యువ నేత మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వాక్చాతుర్యంతో బీజేపీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను ముప్పుతిప్పలు పెట్టే విషయం మనందరికీ తెలిసిందే..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాయకులను ముప్పుతిప్పలు పెట్టి ప్రచారంను హోరెత్తించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తల్లో మంచి క్రేజ్ ఉంది.

కేసీఆర్ పంపించారు అంటూ తన నియోజకవర్గంలో షాదీముబారక్ ,కల్యాణలక్ష్మి చెక్కులను స్వయంగా తానే ఇంటింటికి వెళ్లి అందజేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుంది.

ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ విషయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆంధ్రా నాయకుల నిర్ణయాల పై స్పందించిన తీరు తోపాటు ఇటీవలే బండి సంజయ్ నుద్దేశించి గుచ్చుకుందా? అంటూ పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు, ఒకే వేదికపై తనతో ఉన్న సీఎల్పీ నేత భట్టి ని ఇరకాటంలో పెడుతూ మంత్రి పువ్వాడ తనదైన శైలిలో స్పందించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న విషయం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం..

Related posts

బెయిల్ ఒకే కాని బయటకు వచ్చే అవకాశంలేదు…

Ram Narayana

హుజూరాబాద్ లో తొలిసారి టీఆర్ఎస్ కు లీడ్.. ఎంతంటే..

Drukpadam

కరోనా అవశేషాలు ఉన్నాయంటూ భారత్ నుంచి రొయ్యల దిగుమతి నిలిపివేసిన చైనా….

Drukpadam

Leave a Comment