Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు!

వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు!
-వీడియోలు పోస్టు చేసిన ప్రభాకర్
-అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు రఘురామ ఫిర్యాదు
-స్పందించిన ఢిల్లీ పోలీసులు
-పలు సెక్షన్ల కింద కేసు నమోదు
-యూట్యూబ్ కు నోటీసులు

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదైంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితర ప్రముఖులపై పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడంటూ వచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో తాజా కేసు నమోదైంది. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.

పంచ్ ప్రభాకర్ పై మన రాష్ట్రంలోనూ చర్యలు ఉంటాయా?: డీజీపీని పశ్నించిన వర్ల రామయ్య

కేంద్రం పెద్దలపైనా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపైనా అనుచిత పోస్టులు పెట్టాడంటూ వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీలో కేసు నమోదవడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

వైసీపీ విదేశీ విభాగం సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. పెద్దలపై అసభ్య పోస్టులు పెట్టినందుకు అతడిని ఢిల్లీ రప్పిస్తున్నారని వివరించారు. మరి, మన రాష్ట్రంలోనూ టీడీపీ నేతలు, జడ్జిలపై పంచ్ ప్రభాకర్ అసభ్య పోస్టులు పెట్టాడంటూ ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు. మరి అతనిపై చర్యలు ఉంటాయా డీజీపీ గారూ? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.

 

Related posts

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఘోరం… గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి!

Drukpadam

రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి -పవన్ కు ఇరకాటమేనా : మెగా బ్రదర్ వ్యాఖ్యలతో కలకలం..

Drukpadam

ఏ పదాన్ని కూడా నిషేధించలేదు: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ!

Drukpadam

Leave a Comment