Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కౌశిక్‌రెడ్డికి షాక్… ఎమ్మెల్సీ పదవిపై డైలమా …

కౌశిక్‌రెడ్డికి షాక్… ఎమ్మెల్సీ పదవిపై డైలమా …
-కాబినెట్ నిర్ణయించిన అమలు కానీ వైనం
-ఎమ్మెల్సీ పదవికి అడ్డుపడుతున్న పాత కేసులు,
-పోలిసుల నివేదిక కోరిన కేసీఆర్ ఆచితూచి అడుగులు
-గవర్నర్‌ కోటాలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన కేబినెట్‌
-ఆయనపై ఉన్న కేసులపై సీఎం కేసీఆర్‌కి పలువురి ఫిర్యాదులు
-దీంతో పోలీసు కేసులపై నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంతో నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి పాత కేసులు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవిపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తే రాష్ట్ర కేబినెట్ ఈ నెల 2వ తేదీనే తీర్మానం చేసి పంపినా ఇప్పటివరకు గవర్నర్‌ ఆమోదించినట్టుగా వెల్లడి కాలేదు.అయితే కేబినెట్‌ తీర్మానానికి సంబంధించిన ఫైల్ ఇంకా సీఎం కార్యాలయంలోనే ఉందని.. కౌశిక్‌రెడ్డిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆయా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే ఫైలు గవర్నర్ ఆమోదానికిం పంపించే అవకాశమున్నట్లు సమాచారం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డిపై ఇల్లంతకుంట , సుబేదారి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా వీణవంక, హుజూరాబాద్‌ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాహనం పార్కింగ్‌ విషయంలో తమ బంధువుపై కౌశిక్‌రెడ్డి దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై అసలు ఎన్ని కేసులున్నాయి, దానికి కారణాలేమిటి? వాటి ప్రోగ్రెస్ ఏంటి? అన్నదానిపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఆయన ఫైలును రాజ్‌భవన్‌కు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల రాజేందర్‌ నిష్క్రమణ నేపథ్యంలో అప్పటికి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తానేనంటూ చేసిన ప్రకటన వివాదాస్పమైన సంగతి తెలిసిందే. కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ మొదట్లో భావించినా తర్వాత వెనక్కి తగ్గి గెల్లు శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇచ్చారు. అయితే హుజూరాబాద్‌లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌశిక్‌రెడ్డిని హడావుడిగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

సామాజిక సేవతో పాటు ఇతర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో నామినేట్‌ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన కౌశిక్‌రెడ్డి.. తన తల్లి పేరిట కరీంనగర్‌ జిల్లాలో ‘పుష్పమాల దేవి మెమోరియల్‌ ట్రస్టు’ పెట్టి 2009 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మేరకు క్రీడా, సేవా రంగాల్లో చేసిన కృషి మేరకు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తున్నట్టు కేబినెట్‌ తీర్మానంలో పేర్కొంది. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోటీచేసిన కౌశిక్‌రెడ్డికి వచ్చిన వెంటనే పదవి ఇవ్వడంపై హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు రాష్ట్ర నాయకులూ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతోనే కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్‌కు భారీగా ఫిర్యాదులు అందడంతోనే ఆయన నివేదిక కోరినట్లు సమాచారం .

Related posts

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే!

Drukpadam

వాస్తవాలు చెప్పకుంటే ముక్కు నెలకు రాసి మూలాన కూర్చోండి -కోదండరాం హెచ్చరిక

Drukpadam

నేను ‘సారాయి వీర్రాజు’ కాదు…

Drukpadam

Leave a Comment