Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాకిస్థాన్​ ఆర్మీ అదుపులో తాలిబన్​ అధిపతి.. భారత్​ కు నిఘా వర్గాల సమాచారం!

పాకిస్థాన్​ ఆర్మీ అదుపులో తాలిబన్​ అధిపతి.. భారత్​ కు నిఘా వర్గాల సమాచారం!
-హైబతుల్లా అఖుంజాదా జాడపై విదేశాల నిఘా
-రంజాన్ పండుగ రోజే అతడి నుంచి చివరి సందేశం
-తాలిబన్లతో కలిసిపోతున్న జైషే, లష్కరే ఉగ్రవాదులు
-ఆఫ్ఘన్ లో జర్నలిస్టులను వదలని తాలిబన్లు
-జర్నలిస్టులను వేటాడుతున్న తాలిబన్లు
-ఆఫ్ఘన్ లో మొదలైన తాలిబన్ అరాచకం
-పాత్రికేయులకు గడ్డుకాలం
-ఇంటింటికీ తిరిగి గాలిస్తున్న తాలిబన్లు
-కాల్పుల్లో ఓ జర్నలిస్టు బంధువు మృతి

ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నా.. వారి అధిపతి హైబతుల్లా అఖుంజాదా ఎక్కడున్నాడన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే, అతడు ఎక్కడున్నాడన్న విషయాన్ని భారత్ పసిగట్టినట్టు తెలుస్తోంది. విదేశీ నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. అఖుంజాదా లొకేషన్ ను గుర్తించినట్టు సమాచారం.

విదేశీ నిఘా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం అతడు పాకిస్థాన్ సైన్యం అదుపులో ఉన్నట్టు తెలుస్తోందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆరు నెలలుగా అతడు ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. రంజాన్ పండుగ రోజు అతడిచ్చిన సందేశమే ఆఖరుదన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితుల నేపథ్యంలో అతడిని పాక్ ఎలా హ్యాండిల్ చేస్తుందన్న దానిపైనే ఆసక్తి ఏర్పడిందంటున్నారు. ఇక, ఇటు జైషే మహ్మద్, లష్కరే తాయిబా ఉగ్రవాదులు తాలిబన్లతో మమేకమవుతున్నారని భారత్ కు నిఘా సమాచారం అందినట్టు తెలుస్తోంది.

2016లో అమెరికా చేసిన డ్రోన్ దాడిలో అప్పటి తాలిబన్ అధిపతి అఖ్తర్ మన్సూర్ చనిపోయాడు. దీంతో అదే ఏడాది మేలో మన్సూర్ తర్వాతి స్థానాల్లోని ఇద్దరిలో ఒకడైన హైబతుల్లా అఖుంజాదాను అధిపతిగా నియమించారు. పాకిస్థాన్ లో జరిగిన సమావేశం సందర్భంగా నాడు తాలిబన్లు అతడిని అధిపతిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. అఖుంజాదా న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.

జర్నలిస్టులను వదలని తాలిబన్లు వేటాడి వేధిస్తున్న వైనం

పాశ్చాత్య మీడియా సంస్థల తరఫున ఆఫ్ఘనిస్థాన్ లో వార్తాసేకరణ జరుపుతున్న పాత్రికేయుల కోసం తాలిబన్లు వేటాడుతున్నారు. రాజధాని కాబూల్ తో పాటు ఇతర ప్రావిన్స్ ల్లోనూ విదేశీ మీడియా ప్రతినిధుల కోసం తీవ్రస్థాయిలో గాలింపు జరుపుతున్నారు.

తాజాగా డీడబ్ల్యూ (డాట్షూ వెల్లే) అనే జర్మన్ టీవీ చానల్ ప్రతినిధి కోసం కాబూల్ లో ఇంటింటికీ తిరిగి గాలించారు. అతడు దొరక్కపోయేసరికి, అతడి బంధువులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు పాత్రికేయుడి బంధువు ఒకరు మృతి చెందగా, మరో బంధువు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతరులు తప్పించుకున్నారు.

ఈ ఘటనను డీడబ్ల్యూ చానల్ డైరెక్టర్ జనరల్ పీటర్ లింబోర్గ్ ఖండించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులు ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్టు ఈ ఘటన చాటుతోందని వ్యాఖ్యానించారు. కాగా, కాబూల్ లో డీడబ్ల్యూ చానల్ కోసం పనిచేస్తున్న ఇతర జర్నలిస్టుల ఇళ్లపైనా తాలిబన్లు దాడులు చేసినట్టు చానల్ వర్గాలు తెలిపాయి. అమెరికా, నాటో దళాలకు సహాయ సహకారాలు అందించిన వారిని కూడా తాలిబన్లు వేటాడుతున్నారు.

Related posts

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై!

Drukpadam

బద్వేల్ లో పోటీకిసై అంటున్న బీజేపీ ….

Drukpadam

ఈ నెల 26న రాజ్‌భవన్‌ల ముట్టడి: కిసాన్‌ సంయుక్త మోర్చా…

Drukpadam

Leave a Comment