కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
▪️ ఎంపీ నామ చొరవతో మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల కు చెందిన 150 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు
▪️ ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలసి లబ్ధిదారులకు చెక్కులు అందించిన TRS లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు
సీఎం కేసీఆర్ పాలన యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయని TRS లోక్ సభాపక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు . ఖమ్మం నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం నాడు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి సీఎం సహాయ నిధి నుండి ఎర్రుపాలెం , బోనకల్ , చింతకాని , మధిర , ముదిగొండ మండలాల కు చెందిన 150 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు అనంతరం ఎంపీ నామ మాట్లాడుతూ గడిచిన ఏడేళ్లలోనే సీఎం కేసీఆర్ గారు ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారన్నారు . దేశంలోనే కేసీఆర్ తరహాలో సంక్షేమ పథకాల గురించి ఆలోచించే నాయకుడే లేడన్నారు . సంక్షేమం , అభివృద్ధి రంగాల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు . రాష్ట్రంలోని ప్రతి వర్గానికి మేలు చేసే విధంగా పథకాలను తీసుకువస్తున్నారన్నారు . గడపగడపకు ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుతుందన్నారు ,పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు . ప్రతి ఇంటికి పెద్దదిక్కుగా కేసీఆర్ నిలిచారని ఎంపీ నామ పేర్కొన్నారు . వైద్యం చేయించుకున్న నిరు పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధికంగా చేయూత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు . చెక్కుతోపాటు కేసీఆర్ స్వహస్తాలతో సంతకం చేసి లబ్ధిదారులకు ఈ ఉత్తరాలు పంపండం చరిత్రలో ఇదే మొదటిదన్నారు గతంలో ఎంపీగా గెలిచి గ్యాస్ కనెక్షన్లు , రైల్వే పాసులను వేలాది మందికి ఇచ్చామన్నారు . రెండోసారి మీ ఆశీర్వాదంతో గెలిచినప్పటికి నుంచి సీఎం కేసీఆర్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎక్కువ మందికి అందిస్తున్నానన్నారు . ఎల్లప్పుడు నమ్ముకున్న ప్రజలకు తోడునీడగా నిలుస్తానన్నారు . ఎంపీ కార్యాలయం ప్రజల సమస్యలను తీర్చడానికి ఏర్పాటు చేశామన్నారు . 24 గంటలు క్యాంప్ కార్యాలయం అందులో సిబ్బంది అందుబాటులో ఉంటుందన్నారు . సీఎంఆర్ఎఫ్ సాయం పొందడానికి అర్హులు దరఖాస్తు చేసుకుంటే త్వరగా ఇప్పించడానికి కృషి చేస్తానని ఎంపీ నామ హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కష్టకాలంలో దేవుళ్ల మాదిరిగా ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి , ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ , ఎర్రుపాలెం ఎంపీపీ దేవరకొండ శిరీష , చింతకాని ఎంపీపీ పూర్ణయ్య ,చింతకాని జడ్పీటీసీ తిరుపతి కిషోర్ , డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి , మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ ,జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, చింతకాని ,ముదిగొండ, బోనకల్ మండల పార్టీల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య , మీగడ శ్రీనివాస్ యాదవ్ , బంధం శ్రీనివాసరావు ,వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ సీతారామయ్య , జారే ఆదినారాయణ ,చిత్తారు సింహాద్రి యాదవ్, వైరా మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, ముదిగొండ మండల రైతు బంధు కన్వీనర్ పోట్ల ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంకా మల్లయ్య, నాయకులు తన్నీరు రవికుమార్ గారు, మంకెన రమేష్, చుంచు విజయ్,వంకాయలపాటి లచ్చయ్య, నూతలపాటి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ హనుమంతరావు, బోనకల్ మండల రైతు బంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ గారు,మొగలి అప్పారావు,మాదాల రామారావు, నారాయణ రెడ్డి ,ఉమామహేశ్వరి,కత్తి నాగేశ్వరరావు, కాళేశ్వరరావు, బొర్రా నరసింహారావు, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.