Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

మా ఎన్నికలపై భిన్న స్వరాలూ ….మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు!

మా ఎన్నికలపై భిన్న స్వరాలూ ….మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు
-ఎన్నికల తేదీపై ఏమీ తేల్చకుండానే ముగిసిన ‘మా’ సమావేశం
-నేడు ‘మా’ సర్వసభ్య సమావేశం
-ఎన్నికల తేదీపై భిన్న స్వరాలు
-తేదీ త్వరలో ప్రకటిస్తామన్న కృష్ణంరాజు
-వీలైనంత త్వరగా నిర్వహించాలన్న నరేశ్, ప్రకాశ్ రాజ్
-మా’ జనరల్ బాడీ సమావేశంలో మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు!
-హైదరాబాదులో ‘మా’ సర్వసభ్య సమావేశం
-‘మా’ కోసం స్థలం కొని అమ్మేశారని ఆరోపణ
-పెద్దలు ఆలోచించాలని వ్యాఖ్యలు

నేడు హైద్రాబాద్ లో జరిగిన మా సర్వసభ్య సమావేశంలో ఎన్నికల తేదీలపై ఎటు తేల్చకుండానే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మాట్లాడుతూ మా బిల్డింగ్ కోసం కొన్న స్థలాన్ని రూపాయకు కొని అర్థ రుపాయకు అమ్మటం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఎవరు ఎందుకు స్పందించటంలేదనై నిలదీశారు. మోహన్ బాబు వ్యాఖ్యలపై ఎవరు స్పందించకపోవడం గమనార్హం …అయితే మా ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటిస్తామని కృషం రాజు , మురళి మోహన్ తెలిపారు.

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశం నేడు హైదరాబాదులో జరిగింది. ఎన్నికల తేదీపై ఎటూ తేల్చకుండానే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ‘మా’ ఎన్నికలపై చర్చించినా, ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై ‘మా’ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, మురళీమోహన్ స్పందించారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు.

ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ మాట్లాడుతూ, ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. కొందరు సెప్టెంబరు, కొందరు అక్టోబరు అంటున్నారని వ్యాఖ్యానించారు. డీఆర్సీ కమిటీ ఎలా చెబితే అలా చేస్తానని నరేశ్ స్పష్టం చేశారు. అటు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ‘మా’ సర్వసభ్య సమావేశం జరిపిన 21 రోజుల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబరు 12న కాకుంటే సెప్టెంబరు 19న ఎన్నికలు జరపాలని సూచించారు.

ఇవాళ జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశంలో సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మా’కు సొంత భవనమే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

“భవనం కోసం స్థలం కొన్నారు… అమ్మేశారు. రూపాయికి కొన్న స్థలాన్ని అర్ధరూపాయికి అమ్మేశారు. ఇది ఎంతవరకు సబబు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ‘మా’కు సొంత భవనం కోసం కేటాయించిన సొమ్ముతో స్థలం కొని దాన్ని సగం ధరకే అమ్మేయడంపై సినీ పెద్దలు ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు.

Related posts

అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు.. తరలివచ్చిన తారాలోకం

Ram Narayana

ఒక్కటిగా ఉందాం సినీ పరిశ్రమను బతికించుకుందాం :నటుడు మోహన్ బాబు!

Drukpadam

ఇది పవన్ క‌ల్యాణ్ పై దాడి కాదు… థియేటర్ల వ్యవస్థపై దాడి:ఎన్వీ ప్రసాద్

Drukpadam

Leave a Comment