Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాఖీరాజకీయం…చంద్రబాబు కు రాఖీకట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క!

రాఖీరాజకీయం…చంద్రబాబు కు రాఖీకట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క!
-చంద్రబాబుతో పాటు ఆయన మనవడు దేవాన్ష్ కు కూడా రాఖీ కట్టిన సీతక్క
-చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీతక్క, పరిటాల సునీత
-రాఖీ కట్టి పాదాలకు నమస్కారం
-అక్షింతలు చల్లి ఆశీస్సులు అందించిన చంద్రబాబు

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి మెలిసి తిరిగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. వీలైతే బీజేపీ తో చట్టాపట్టాలకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ మొన్నటి వరకు తెలుగు దేశమో ఉండి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరిన సీకక్కకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం … అందువల్ల ఆమె చంద్రబాబు ను ఎప్పుడు తన రాజకీయ గురువుగా భావిస్తుంటారు. ఆయన కూడా ఆమె పట్ల అదే వైఖరితో ఉన్నారు. పార్టీ మారినప్పటికీ ఎప్పుడు ఆమె పై కోపం ప్రదర్శించలేదు. ఇటీవల సీతక్క తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాఖి పూర్ణమి సందర్భంగా సీతక్క చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనకు రాఖి కట్టి ఆయన అశ్వర్ వచనాలు తీసుకున్నారు. దీనిపై ఆశక్తి నెలకొన్నది. ఆమె తన రాజకీయ గురువును గుర్తు పెట్టుకున్న తీరు రాజకీయ వర్గాలలో చర్చ నియాంశం అయింది.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తాను సోదరుడిగా భావించే చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఆపై ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడే ఉన్న తన మనవడు దేవాన్ష్ కు సీతక్కను పరిచయం చేశారు. దాంతో సీతక్క చిరునవ్వులు చిందిస్తూ చిన్నారి దేవాన్ష్ కు కూడా రాఖీ కట్టారు. అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత కూడా తమ పార్టీ అధినేతకు రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు.

ఇటీవల సీతక్క తల్లి సమ్మక్క ఆరోగ్య బాగాలేక హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరగా, చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించడమే కాకుండా, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలంటూ అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. సీతక్కకు ధైర్యం చెప్పారు.

Related posts

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్!: కేంద్రమంత్రి పదవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య…

Drukpadam

ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌.. విష‌యం ఏమిటంటే..!

Drukpadam

తెలంగాణ కాంగ్రెస్ లో రగడపై …రంగంలోకి దిగిన ఢిల్లీ పెద్దలు!

Drukpadam

Leave a Comment