Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కూలిన మంగళగిరి దేవస్థానం ప్రహరీ.. 200 ఏళ్ల చరిత్ర!

కూలిన మంగళగిరి దేవస్థానం ప్రహరీ.. 200 ఏళ్ల చరిత్ర
-దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిన ప్రహరీ
-శనివారం కురిసిన వర్షాల వల్లేనంటున్న అధికారులు
-శిథిలాల కింద బైక్‌లు, తోపుడు బండ్లు!

మంగళగిరి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గోడ కులాడటం తో అధికారులు అలర్ట్ అయ్యారు . నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సందర్భంగా ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చేప్పాలి . ఎప్పుడో నిర్మించిన భారీ రాతిగోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ ప్రాంతానికి సమీపంలో నివసించే వారు ఒక్క సరిగా ఉలిక్కి పడ్డారు. ఏమిజరిగిందో తెలుసుకునేందుకు బయటకు రావడంతో గోడ కూలి ఉండటాన్ని గమనించి అధికారులకు ,పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కూలిన గోడ పరిశీలించారు.గోడకింద కొన్ని తోపుడు బండ్లు , మరికొన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. కూలిన గోడ శిధిలాలను తొలగించి వారికిందు ఉన్న వాటిని వెలికి తీసే పనిని ముముమ్మరం చేశారు. దేవాదాయ శాఖా అధికారులు కూడా సంఘటనపై ఆరా తీశారు.

200 ఏళ్ల చరిత్ర కలిగిన గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రహరీలో కొంత భాగం గత రాత్రి కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిజానికి ఆ ప్రాంతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల కారణంగా నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, శిథిలాల కింద కొన్ని ద్విచక్రవాహనాలు, తోపుడుబండ్లు ఉన్నట్టు తెలుస్తోంది.

దాదాపు 20 అడుగుల పొడవుండే ఈ ప్రహరీని దక్షిణ గాలి గోపురానికి దగ్గరలో రాతితో నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగానే దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిపోయినట్టు చెబుతున్నారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే దేవస్థానం అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాటిని వెలికి తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Related posts

అదానీ గ్రూప్ పై ఆరోపణలపై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు!

Drukpadam

పీఎస్సార్ ఆంజనేయులుకు చంద్రబాబు నో అపాయింట్మెంట్ …

Ram Narayana

Drukpadam

Leave a Comment