Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టిడ్కో ఇళ్లు, పథకాలపై లోకేశ్ కు అవగాహన లేదు: బొత్స!

టిడ్కో ఇళ్లు, పథకాలపై లోకేశ్ కు అవగాహన లేదు: బొత్స!
-బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నాం
-మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం
-టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలపై సీఎం సమీక్ష నిర్వహించారు
-మంత్రి బొత్స ఒక బ్లఫ్ మాస్టర్ లా తయారయ్యారు: సీపీఐ రామకృష్ణ
-మంత్రి బొత్సపై ధ్వజమెత్తిన రామకృష్ణ
-టిడ్కో ఇళ్లు ఏ విధంగా ఇస్తారో చెప్పాలన్న సీపీఐ నేత
-ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు
-బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని వెల్లడి

టీడీపీ నేత నారా లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, టిడ్కో ఇళ్ల గురించి లోకేశ్ కు అవగాహన లేదని చెప్పారు. వారి ప్రభుత్వంలో ఏం చేశారు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏమేం ఇస్తోందనే విషయాలను పోల్చుతూ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. బీసీల స్థితిగతులను మార్చేందుకు ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స మరోసారి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని చెప్పారు. అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ అన్నప్పుడు పిటిషనర్లే వాయిదా అడగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపులు, జగనన్న కాలనీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని, పనులను వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు.

 

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. మంత్రి బొత్స ఒక బ్లఫ్ మాస్టర్ లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ‘మేం ఏదన్నా అంశంపై ఉద్యమం చేస్తామని చెబితే చాలు… మంత్రి బొత్స వెంటనే ఏదో ఒక ప్రకటన చేసిన ప్రజలను మోసం చేస్తున్నారు’ అంటూ విమర్శించారు. టిడ్కో ఇళ్లు ఏ విధానం ప్రకారం ఇస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జంకుతున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు.

Related posts

రెండవ రోజు బండి సంజయ్ పై దాడి …సీఎం ప్రోద్బలంతోనే దాడులు సంజయ్

Drukpadam

భారత రాజకీయాల్లో మరో కొత్త జాతీయపార్టీ ..బీఆర్ యస్!

Drukpadam

వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధర చట్టం తేవాలి…

Drukpadam

Leave a Comment