11 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న తెలంగాణ మహిళ తమిళనాడులో ప్రత్యక్షం
-11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ
-ఆ తర్వాత రెండేళ్లకు అంత్యక్రియలు
-మతిస్థిమితం కోల్పోయి తమిళనాడు చేరుకున్న మహిళ
-చేరదీసి చికిత్స అందించిన స్వచ్ఛంద సంస్థ
దశాబ్ద కాలం క్రితం చనిపోయిందని భావించిన మహిళ తాజాగా కనిపించడంతో బాధిత కుటుంబ సభ్యులు ముందు షాక్‌కు గురై.. ఆ తర్వాత ఆనందంలో మునిగితేలారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన నర్సయ్య-లక్ష్మి (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నర్సయ్య గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి ఉన్నట్టుండి ఇంటినుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా ఫలితం లేకపోయింది.
ఆ తర్వాత రెండేళ్లకు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను బట్టి ఆమె లక్ష్మియేనని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేసేశారు. మరోవైపు, మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి ఇంటి నుంచి బయలుదేరి తిరుగుతూ తిరుగుతూ తమిళనాడులోని పెరంబలూరు చేరుకుంది. అక్కడ ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చికిత్స చేయించింది.