Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు కోర్టుకు….

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు కోర్టుకు
-రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్టు జ్యోతిష్యుడి ఫిర్యాదు
-ఇప్పటికే రెండుసార్లు నోటీసులు
-గత రాత్రి అకస్మాత్తుగా అరెస్ట్

డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్‌లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేపట్టారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.గతంలో కూడా మల్లన్న పై అనేక కేసులు ఉన్నాయి. అంతకుముందు ఒక యువతి తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పడుకూడా అయన కార్యాలయంపై దాడులు జరిగాయి. పోలీసులు విచారించారు. ఖమ్మం ,నల్లగొండ , వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోలిచేసి గట్టి పోటీ ఇచ్చి స్వల్పతేడాతో ఓడిపోయారు. మల్లన్న కు అన్ని ఓట్లు రావడంపై రాజకీయపడితులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తరువాత ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది. నిత్యం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ,ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం చేస్తున్నారు. దీంతో ఆయనపై కావాలనే పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారని అభిప్రాయాలూ ఉన్నాయి.

Related posts

నేను ఏం నేరం చేశాను?… ఎన్ఐఏ సోదాల‌పై మావోయిస్టు ఆర్కే భార్య ఆవేద‌న!

Drukpadam

హైద‌రాబాద్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌.. బాలిక అనుమానాస్ప‌ద మృతి!

Drukpadam

సోను సూద్ పై ఐటీ దాడులు….

Drukpadam

Leave a Comment