Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పదో తరగతిలో గ్రేడ్లకు స్వస్తి.. మళ్లీ మార్కుల విధానం ప్రవేశపెట్టనున్న ఏపీ!

పదో తరగతిలో గ్రేడ్లకు స్వస్తి.. మళ్లీ మార్కుల విధానం ప్రవేశపెట్టనున్న ఏపీ!
-విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో గ్రేడ్ల విధానం
-ఇంటర్‌లో ప్రవేశాలకు ఇప్పుడిదే అడ్డంకి
-మళ్లీ పూర్వ విధానంలోకి మారుస్తూ ఉత్తర్వులు

పదో తరగతి విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడ్ల విధానానికి స్వస్తి పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానాన్నే ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల్లో ఎక్కువమందికి ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల విషయంలో సమస్యలు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

2019 విద్యా సంవత్సరానికి గాను గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇవ్వనుండగా, 2020 మార్చి నుంచి మార్కులు కేటాయించనున్నారు. ఇంటర్‌ ప్రవేశాలను ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించడంతో సీట్ల కేటాయింపు అధికారులకు కష్టంగా మారింది. దీంతో పరీక్షల విభాగం నుంచి విద్యార్థుల మార్కులు తీసుకుని ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించాలని తొలుత నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించింది. ఈ నేపథ్యంలోనే గ్రేడ్ల విధానాన్ని ఎత్తివేసి మునుపటి మార్కుల విధానానికి మొగ్గు చూపింది.

ఏపీ ప్రభుత్వం గ్రేడ్ల విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయంచడంపట్ల కొంతమంది హర్షతిరేకలు వ్యక్తం చేస్తుండగా మరికొందరు మిమర్శిస్తున్నారు. చాలాకాలం తరువాత దీనిపై నిర్ణయం తీసుకోవడం తో విద్యార్థులు తల్లిదండ్రులనుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాల్సిందే !

Related posts

చావు తరుముకొస్తే అంతే.. పాక్ బిలియనీర్ కుమారుడు యాత్రకు వెళ్లాలనుకోలేదట!

Drukpadam

మీకు తుపాకీ పట్టుకోవడం వచ్చా… అయితే సైన్యంలో చేరండి:ఉక్రెయిన్ ప్రభుత్వం!

Drukpadam

తెలంగాణోద్యమంలో మీడియా పాత్ర కీలకం-జనగామ ఎమ్యెల్యే యాదగిరి రెడ్డి!

Drukpadam

Leave a Comment