Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాబూల్ బాంబు దాడి చేసిన ముఠాలో 14 మంది మలయాళీలు!

కాబూల్ బాంబు దాడి చేసిన ముఠాలో 14 మంది మలయాళీలు!
-బాంబు దాడికి బాధ్యత వహించిన ఐఎస్ఐఎస్-కే
-ఈ ముఠాలోనే 14 మంది మలయాళీలు
-2014లో ఈ ముఠాలో చేరినట్లు అనుమానం
-13 మంది కాబూల్‌లో.. ఇంటిని కాంటాక్ట్ చేసిన ఒక మలయాళీ

తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజల అవస్థలు చూసి జాలిపడుతున్న ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి కారణం రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్న కాబూల్ విమానాశ్రయం ప్రాంతంలో జరిగిన బాంబు దాడులే. ఈ బాంబు పేలుళ్లలో సుమారు 170 మంది మరణించారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లకు బాధ్యత వహించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్ఐఎస్-కే) ఉగ్రవాద ముఠాలో 14 మంది కేరళ వాసులు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా బాగ్రామ్ జైల్లో ఉండగా తాలిబన్లు విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రచురితమైన కొన్ని కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ 14మంది మలయాళీల్లో 13 మంది కాబూల్‌లో ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాద సంస్థతోనే ఉండగా.. ఒక వ్యక్తి మాత్రం కుటుంబాన్ని సంప్రదించాడట. దీంతోనే ఈ వార్తలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 2014లో మోసుల్‌ను సిరియా, లేవాంట్ ఆక్రమించుకున్న తర్వాత చాలా మంది కేరళవాసులు భారత్ నుంచి వచ్చేసి ఈ జిహాదీ ముఠాలో చేరినట్లు సమాచారం. వీళ్లంతా కేరళలోని మలప్పురం, కాసరగాడ్, కన్నూర్ జిల్లాలకు చెందిన వారేనట. ఆ తర్వాత వీరిలో కొందరు ఆఫ్ఘనిస్థాన్ వచ్చినట్లు సమాచారం

ఐఎస్ఐఎస్-కేలో ఉన్న ఈ మలయాళీలను అడ్డుపెట్టుకొని.. అంతర్జాతీయంగా భారత పరువుకు భంగం కలిగించడానికి తాలిబన్లు ప్రయత్నిస్తారని భారత ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత కొందరు తాలిబన్ ఫైటర్లు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాలిబన్లలో కొందరు మలయాళీలు ఉన్నట్లు కనబడుతోందని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ఆ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి ఆయన ఈ విశ్లేషణ చేశారు. అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.

Related posts

లేటు వయసులో పదో తరగతి పాసైన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా!

Drukpadam

ఇంగ్లాండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర లేబర్ పార్టీ నుంచి కౌన్సిల్ కు ఎన్నిక!

Drukpadam

ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య వెయ్యి ఎకరాల్లో లే అవుట్లకు హెచ్ఎండీఏ కసరత్తులు!

Drukpadam

Leave a Comment