Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లేటు వయసులో పదో తరగతి పాసైన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా!

లేటు వయసులో పదో తరగతి పాసైన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా!
గతంలో పదో తరగతి ఇంగ్లీషు పరీక్షలో ఫెయిల్
ఇటీవల మరోసారి పరీక్ష రాసిన మాజీ సీఎం
88 మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటన

పట్టుదలే ఉంటె ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా … ఆయన పదవ తరగతి వరకు కూడా చదవకుండానే అభివృద్ధిని చెందిన రాష్ట్రంగా పేరున్న హర్యానా కు ముఖ్యమంత్రి అయ్యారు. టీచర్స్ నియామకంలో అవకతవకలు జరగటంతో ఆయన్ను కోర్ట్ దోషిగా తేల్చి శిక్ష విధించింది…. ఆయన జైలు జీవితం గడిపారు. కానీ పదవ తరగతి చావలేదనే బెంగ ఆయనలో ఉంది. దీంతో ఆయన పదవతరగతి పరిక్ష రాశారు. అయితే అన్ని సబ్జెక్టులు పాస్ అయిన ఆయన ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు . దీంతో ఆయన ఇంగ్లీష్ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇప్పడు ఆయన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ లో చేరారు . ఆయన పట్టుదలకు ప్రసంశలు అందుకున్నారు. …

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా పదో తరగతి పాసయ్యారు. గతంలో ఆయన పదో తరగతి పరీక్షలు రాసినప్పుడు ఇంగ్లీషు పరీక్షలో ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి పరీక్ష రాసిన ఆయన ఉత్తీర్ణులైనట్లు తెలుస్తోంది. ఓపెన్ స్కూల్‌ విధానంలో ఇంటర్మీడియెట్‌లో ఆయన చేరారు.

కానీ కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే ఇంటర్ విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో 10వ తరగతిలో ఒక పరీక్షలో ఫెయిలైన కారణంగా చౌతాలా ఫలితాన్ని వెల్లడించలేదు. దీంతో ఆయన మళ్లీ ఈ పరీక్ష రాయాల్సి వచ్చింది. తాజాగా ఆయన ఇంగ్లీషు పరీక్షను 88 మార్కులతో పాసైనట్లు హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది.

86 ఏళ్ల చౌతాలా ఇండియన్ లోక్ దళ్ (ఐఎల్‌సీ) పార్టీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణంలో చౌతాలాతోపాటు మరో 53 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు.. ఆయనకు పదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Related posts

మోదీని ప్రశ్నించిన అమెరికా జర్నలిస్టుకు వేధింపులు…

Drukpadam

బంగాళాఖాతంలో వాయుగుండం… కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన…

Ram Narayana

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పడ‌వ ప్ర‌మాదం…గోదావ‌రిలో ప‌డిపోయిన నేత‌లు!

Drukpadam

Leave a Comment