Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలు పవిత్ర గ్రంథాలు కాదు -ఫారూఖ్ అబ్దుల్లా

వ్యవసాయ చట్టాలు పవిత్ర గ్రంథాలు కాదు -ఫారూఖ్ అబ్దుల్లా
-చేతులెత్తి మొక్కుతున్న చట్టాలను రద్దు చేయండి
-గతంలో ప్రధానులు చట్టాలను వెనక్కు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి
-ప్రేస్టిజ్ కి , ఇగోలకు పోకండి -మనమంతా భారతీయులమే
-రాముడు అందరివాడు-ఖురాన్ అందరిగురించి చెప్పింది
ఇటీవల పార్లమెంట్ లో చేసిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయకుండా ఉండేంత పవిత్ర గ్రంథాలు ఏమి కాదని ఫారూఖ్ అబ్దుల్లా అన్నారు. లోకసభలో ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు .సీనియర్ పార్లమెంటేరియన్ గా ఆయన ప్రసంగం అద్భుతంగా ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమని ప్రపంచానికే ఆదర్శం అని చెప్పుకుంటున్నాం . ఈ రోజు మన చర్యలవలన దాని ప్రకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు మనం తయారు చేసుకున్నయే కదా? అవి మాకు అవసరం లేదు వాటిని రద్దు చేయండని రైతులు కోరుతున్నారు. వాటిని రద్దు చేసేందుకు మనకు వస్తున్నా అభ్యతరం ఏమిటి వారితో మాట్లాడి ఎందుకు పరిస్కారం కనుగొనలేక పోతున్నామని ప్రశ్నించారు. ఇందులో ఇగోలు అక్కరలేదు. ప్రతిష్టకు పోకండని సూచించారు. చట్టాలు రైతులకోసం అంటున్నారు. వారు అవి మాకు వద్దే వద్దు అంటున్నారు. అడిగేవారు ఎవరు మనవాళ్లే కదా ? మన భారతీయలే కదా ? ఒకరినొకరం గౌరవించుకుందాం. దానివల్ల దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుంది . గతంలో ప్రధానులు తాము చేసిన అనేక చట్టాలను ప్రజల వత్తిడి మేరకు వెనక్కు తీసుకున్న సందర్భాలను గుర్తుచేశారు. మనం చేసిన చట్టాలు మంచివి కావని సంబంధిత వర్గాలు బావిస్తున్నప్పుడు రద్దుచేయకుండా ఉండటం దేశానికి మంచిది కాదు . ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకే .అవి మంచివి అనుకుంటే స్వీకరించండి లేక పొతే వదిలేయండి . రాముడు అందరివాడు . అలాగే ఖురాన్ ఒక్క ముస్లింల కోసమే రాయబడలేదు . ప్రజలకోసం అనేక విషయాలు చెప్పింది . అందువల్ల గ్రంధాలలో సారాంశాన్ని అర్థం చేసుకోండి . కోవిద్ కారణంగా మనం అనేక ఇబ్బందులు పడ్డాం. లక్షలాది మంది పనులు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ లో టూరిజం బాగాతగ్గిపోయి అనేకమంది జీవన భృతి కోల్పోయారు. ఈ విషయాలు చెప్పేందుకు మాటలు సైతం చాలటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిద్ వాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు . దేశం ఉపద్రవం నుంచి కోలుకోవాలని ఆశిద్దాం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Related posts

ధరలు భారం పేదలపై …లాభాల వాటా ధనికులకు :మోడీ విధానాలపై రాహుల్ ఫైర్!

Drukpadam

ఏపీ సీఎం జగన్ , అమిత్ షా తో భేటీ రద్దు అయిందని పెద్ద ఎత్తున వార్తలు …కాని గంటన్నర భేటీ

Drukpadam

ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి స్పందన!

Drukpadam

Leave a Comment