Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల ఎంట్రీతో ఉలిక్కి పడ్డ రాజకీయ పార్టీలు

షర్మిల ఎంట్రీతో ఉలిక్కి పడ్డ రాజకీయ పార్టీలు
షర్మిల తెలంగాణాలో రాజకీయ ఎంట్రీతో రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. షర్మిల పార్టీ పెడితే ఎవరికీ లాభం ? ఎవరికీ నష్టం ? అనేదానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణాలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. షర్మిల రాజకీయ రంగ ప్రవేశం ముమ్మాటికీ కెసిఆర్ కుట్రలో భాగమేనని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ లు ధ్వజమెత్తాయి . ఇప్పటి వరకు ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా దివంగతనేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పార్టీ పెడుతున్నట్లు వస్తున్నా వార్తలపై ఆశక్తి పెరిగింది . ఏమిజరుగుతుంది తెలంగాణలో, అసలు షర్మిల నిర్ణయం వెనక ఎవరున్నారు. జగన్ హస్తం ఉందా? వైయస్ కుటుంబంలో చిలీక వచ్చిందా ? జగన్ ఆశీస్సులు ఉన్నాయా ? అంటే లేవనే అంటున్నాయి వైసిపి వర్గాలు . వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి షర్మిల పార్టీ పై క్లారిటీ ఇచ్చారు. తమకు షర్మిల పెట్టె పార్టీకి ఎలాంటి సంభందం లేదని చెప్పారు. తాము ఆమె పార్టీ పెట్టి విషయాన్నీ చెప్పినప్పుడు వద్దని వారించమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయని వారితో గొడవ పెట్టుకోవటం ఇష్టం లేదని జగన్ బావిస్తునట్లు సజ్జల చెప్పారు. ఆమె మాత్రం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని అంటున్నారు. జగన్నా వదిలిన బాణం ఇప్పుడు కేసీఆర్ వదులుతున్న బాణంగా మారిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ గడ్డను తెలంగాణ బిడ్డలే పాలించాలిగాని మరెవరో పాలించటం తెలంగాణ సమాజం ఒప్పుకోదని అన్నారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత వి. హెచ్ అన్నమీద కోపం ఉంటె అక్కడ పార్టీ పెట్టాలి ఆయనతో తేల్చుకోవాలి కానీ ఇక్కడ ఏమిటని అన్నారు. బీజేపీ ఇది ముమ్మాటికీ కేసీఆర్ కుట్రలో భాగమేనని కేవీపీ రామచందర్ రావు ద్వారా కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించింది . సిస్టర్ షర్మిల పార్టీ వెనక కచ్చితంగా ఎత్తుగడ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద అన్ని పార్టీలు దీనిపై స్పందించాయి.
షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆంధ్రాలో కన్నా తెలంగాణాలో అభిమానులు ఎక్కువగా ఉన్నారని అందువల్ల ప్రజల్లో ఇప్పటికి ఆయనకు మంచి ఇమేజ్ ఉందని అందువల్ల అది షర్మిలకు కలిసి వచ్చే ఆవకాశం ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఆయన ప్రవేశ పెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ , 108 ఇతర సంక్షేమ పథకాలు చెరగని ముద్రవేశాయి.
ఇక పార్టీలోకి ఇప్పటి వరకు పెద్దతలలు ఎవరు వస్తారనే దానిపై క్లారిటీ లేకున్నా , వైయస్సార్ కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ గా గెలిచి టీఆరెఎస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అంటే కాకుండా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మహిళా చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి , ఖైరతాబాద్ శాసనసభ్యడు దానం నాగేందర్, నిజామాబాద్ రురల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ , ఖమ్మం జిల్లాలో గతంలో గెలిచినా శాసనసభ్యులు షర్మిల పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా సమాచారం లేక పోయిన ప్రస్తుతం వారు ఉన్న పార్టీలో అనేక ఇబ్బందులు అవమానాలకు గురిఅవుతున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి. షర్మిల పార్టీకి ఇంకా ఒక రూపు లేనందున ఎవరెవరు వస్తారు అనేది చూడాల్సిందే .జనంలో ఉండే క్రేజ్ ను బట్టి ఆదరణ చూసి అనేక మంది వస్తారు. జనంలో క్రేజ్ లేకపోతె మాత్రం ఆమె పార్టీ ప్లాఫ్ అవుతుంది . అప్పుడు రాజకీయాలపై ఆశక్తి ఉన్న ఆమె ఏరకమైన నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిందే మరి !!!

Related posts

ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నారు: భట్టి

Drukpadam

జగన్ ది హిట్లర్ గిరి…స్థానికసంస్థల ఎన్నికల్లో వైకాపా చర్యలపై లోకేష్ మండిపాటు!

Drukpadam

సొంతపార్టీ పైనే ధర్మాన చురకలు …ప్రభుత్వ పెద్దలకు అధికారుల తప్పుడు సలహాలు!

Drukpadam

Leave a Comment