నవంబరు నుంచి వాట్సాప్ సేవలు ఈ క్రింద మొబైల్స్‌లో బంద్ కానున్నాయి!
-జాబితా విడుదల చేసిన వాట్సాప్
-నవంబరు 1 నుంచి సేవలు నిలిపివేయనున్న వాట్సాప్
-జాబితాలో ఐఫోన్ సహా పలు ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్
ప్రస్తుతం దాదాపుగా అందరూ ఉపయోగించే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ సంస్థ ఏటా తమ సేవలు నిలిపివేసే పాత మొబైల్ మోడల్స్ వివరాలు వెల్లడిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఆ జాబితాను వాట్సాప్ వెల్లడించింది. ఈ ఏడాది నవంబరు 1 నుంచి జాబితాలోని మొబైల్స్‌లో వాట్సాప్ సెక్యూరిటీ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉండబోవని తెలిపింది.
ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కై2.5.1 వెర్షన్ ఓఎస్‌లు.. వీటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే మొబైల్స్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే వాట్సాప్ విడుదల చేసిన జాబితాలో యాపిల్ ఐఫోన్‌తోపాటు శాంసంగ్, ఎల్‌జీ, జడ్‌టీఈ, హువాయ్, సోనీ, హెచ్‌టీసీ తదితర బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి.
-ఐఫోన్
ఐఫోన్ ఎస్‌ఈ (మొదటి జనరేషన్) మొబైల్స్‌తోపాటు ఐఫోన్ 6ఎస్, 6 ఎస్ ప్లస్ మోడల్స్ ఫోన్లు ఐఓఎస్ 10కి అప్‌డేట్ కాలేదంటే.. ఆ మొబైల్స్‌లో వాట్సాప్ సేవల్ బంద్ కానున్నాయి. అయితే నిపుణుల మాటేంటంటే.. ఈ మొబైల్స్ ఐఓఎస్ 14 వెర్షన్ వరకూ సపోర్ట్ చేస్తాయట. కాబట్టి వీటి ఐఓఎస్ అప్‌డేట్ చేసుకుంటే వాట్సాప్ పనిచేస్తుందని వారి సలహా.
-ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్, ఎల్‌జీ తదితర ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిస్తే..
-శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్2, ఎస్2 మినీ, గెలాక్సీ ట్రెండ్ లైట్, ట్రెండ్ 11, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్2, గెలాక్సీ ఎక్స్‌కవర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మోడల్స్ మొబైళ్ల అమ్మకం భారత్‌లో ఎప్పుడో నిలిచిపోయింది. కానీ ఇంకా ఎవరైనా వీటిని వాడుతుంటే మాత్రం నవంబరు 1 నుంచి వాళ్లు వాట్సాప్‌కు వీడ్కోలు చెప్పుకోవాల్సిందే.
-ఎల్‌జీ
ఎల్‌జీ లూసిడ్ 2, ఆప్టిమస్ సిరీస్‌లో ఎఫ్7, ఎఫ్5, ఎల్2 II డ్యూయల్, ఎల్3 II, ఎల్4 II, ఎల్4 II డ్యూయల్, ఎల్5, ఎల్5 II, ఎల్5 II డ్యూయల్, ఎల్7, ఎల్7 II డ్యూయల్, ఎల్7 IIచ ఎఫ్6, ఎఫ్3, ఎఫ్2 II, నిట్రో హెచ్‌డీ, 4 ఎక్స హెచ్‌డీ, ఎఫ్3క్యూ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
-జెడ్‌టీఈ
జెడ్‌టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987, గ్రాండ్ మెమో, వీ956 మోడల్స్‌లో నవంబరు 1 నుంచి వాట్సాప్ బంద్ కానుంది.
హువాయ్
అసెండ్ మేట్, అసెండ్ జీ740, అసెండ్ డీ క్వాడ్ ఎక్స్‌ఎల్, అసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్‌ఎల్, అసెండ్ పీ1 ఎస్, అసెండ్ డీ2 మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.
-సోనీ
సోనీ ఎక్స్‌పీరియా మిరో, సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్ మోడల్స్‌లో కూడా వాట్సాప్ నిలిచిపోనుంది.
ఇవే కాకుండా వికో డాక్స్ లైట్, ఆల్కాటెల్ వన్ టచ్ ఈవో7, ఆర్కోస్ 53 ప్లాటినం, క్యాటర్‌పిల్లర్ క్యాట్ బీ15, వికో సింక్ ఫైవ్, లెనోవో ఏ820, యూఎమ్ఐ ఎక్స్2, ఫైమా ఎఫ్1, టీహెచ్‌ఎల్ డబ్ల్యూ8, హెచ్‌టీసీ డిజైర్ 500 కూడా వాట్సాప్ విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ మోడల్స్ దేనిలోనైనా ఓఎస్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటే.. దాన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటే వాట్సాప్ సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.