Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రెండేళ్లుగా విధులకు హాజరు కాని మహిళా ఐపీఎస్.. కనిపించడం లేదంటూ పత్రికా ప్రకటనలు!

రెండేళ్లుగా విధులకు హాజరు కాని మహిళా ఐపీఎస్.. కనిపించడం లేదంటూ పత్రికా ప్రకటనలు!
-సెలవు పెట్టకుండా, చెప్పకుండా రెండేళ్లుగా విధులకు డుమ్మా
-నోటీసులకు, ఈ-మెయిల్స్‌కు స్పందన కరవు
-శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు

ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు ఉద్యోగానికి చెప్పా పెట్టకుండా ఎగనామ్ పెట్టిన ఒక అధికారి పై చర్యలకు ఉపక్రమించింది. ఒడిశా సర్కార్ . ఆమెది అల్లాటప్పా ఉద్యోగం కూడా కాదు . ఐపీసీ అధికారి గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. చిన్న చితక పోస్ట్ కాదు ఆమె హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ సెల్ ఐ జి . రెండు సంవత్సరాలుగా ఉద్యోగం మానేశారు. సెలవు పెట్టిందా అనే అదికూడా లేదు . చివరికి మొఖికంగానన్న పై అధికారులకు చెప్పి పర్మిషన్ తీసుకోండి అంట అది లేదు . ఆమె అచికి కోసం అధికారులు ప్రయత్నాలు చేసిన ఆమె జాడ దొరకలేదు .ఆమెకు మెయిల్స్ పంపిన సమాధానం లేదు. అందువల్ల చివరకు అధికారులు ఆమె కనిపించడం లేదంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు . ఇది ఇప్పుడు దేశ వ్యాప్తితంగా ఆశక్తి కలిగిస్తూ చర్చనీయాంశంగా మారింది.

సెలవు తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా రెండేళ్లుగా విధులకు హాజరు కాని ఓ మహిళా ఐపీఎస్ అధికారి కనిపించడం లేదంటూ ఉన్నతాధికారులు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఒడిశాలోని కటక్ పోలీసు ప్రధాన కేంద్రం కథనం ప్రకారం.. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఐజీగా పనిచేస్తున్న భారతి రెండేళ్లుగా విధులకు హాజరు కావడం లేదు. అలాగని సెలవు కూడా తీసుకోలేదు. ఉన్నతాధికారులకు కనీసం మౌఖికంగానైనా చెప్పలేదు.

అలా రెండేళ్లుగా ఆమె విధులకు హాజరు కాకపోవడంతో మానవహక్కుల విభాగంలో బోల్డన్ని కేసులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇన్నాళ్లుగా ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసు ప్రధాన కార్యాలయం పలుమార్లు నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఈ-మెయిల్స్‌కు కూడా స్పందనలేదు. దీంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు నిన్న వివిధ పత్రికల్లో ఆమె కనిపించడం లేదంటూ ప్రకటనలు ఇచ్చారు.

Related posts

హైద్రాబాద్ లో అనుమానిత వ్యక్తి చేతిలో బ్యాగు … భారీ పేలుడు!

Drukpadam

కోడిపందాల్లో అపశృతి… కోడికత్తి తగిలి వ్యక్తి మృతి!

Drukpadam

పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్

Drukpadam

Leave a Comment