Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నారా లోకేష్ నరసారావు పేట పర్యటనను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్!

నారా లోకేష్ నరసారావు పేట పర్యటనను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్!
నేను పర్మిషనే అడగనప్పుడు… ఎలా తిరస్కరిస్తారు?: పోలీస్ అధికారితో నారా లోకేశ్
లోకేశ్ నరసరావుపేట పర్యటనలో ఉద్రిక్తత
విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అని లోకేశ్ మండిపాటు

టీడీపీ నేత నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను… గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుని, కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. ఆయన కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు ప్రయాణిస్తున్నాయి.

మరోవైపు, ఎయిర్ పోర్టు వెలుపల తన వాహనంలో కూర్చున్న నారా లోకేశ్ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. మీ పర్యటనకు అనుమతిని నిరాకరించారంటూ ఓ పోలీస్ అధికారి సమాధానమివ్వడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పర్యటన కోసం అసలు అనుమతినే అడగలేదని… అలాంటప్పుడు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తాను ధర్నా చేయడం లేదని, పాదయాత్ర చేపట్టడం లేదని… కేవలం ఒక కుటుంబాన్ని పరామర్శించి, అక్కడ మీడియాతో మాట్లాడి, అనంతరం తిరిగి వెళ్లిపోతానని చెప్పారు. అయినప్పటికీ తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. ఏది తప్పో, ఏది ఒప్పో తనకు తెలుసని… తనపై ఎలాంటి కేసులు లేవని లోకేశ్ తెలిపారు.

నారా లోకేశ్ ను ఉండవల్లిలోని నివాసానికి తరలించిన పోలీసులు

ఇటీవల గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకు గురికాగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యక్రమాలకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో నారా లోకేశ్ ను ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. అంతకుముందు లోకేశ్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అటు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ తో సమావేశమయ్యారు. లోకేశ్ పర్యటనను అడ్డుకోవడం, ఇతర పరిణామాలపై ఆమె సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. మహిళల భద్రత, అత్యాచార ఘటనల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్టు సమాచారం.

Related posts

అంగళ్ల ఘటనపై వైసీపీ ,టీడీపీ పరస్పర ఆరోపణలు ..

Ram Narayana

ప్రియాంక నిరుద్యోగుల నిరసన సభపై కాంగ్రెస్ గంపెడు ఆశలు…

Drukpadam

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment